Amazon ASUS Days Sale : అమెజాన్‌లో అసూస్ డేస్ సేల్ ఆఫర్లు.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి!
Amazon ASUS Days Sale : ల్యాప్‌టాప్, కంప్యూటర్ డెస్క్‌టాప్ కొంటున్నారా? అమెజాన్ అసూస్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. పూర్తి సేల్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Amazon ASUS Days Sale
Amazon ASUS Days Sale : కొత్త ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో అసూస్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ అసూస్ సేల్ సందర్భంగా పలు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ఇతర అప్లియన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ సేల్ మార్చి 17, 2025న ముగియనుంది. ఈ డీల్ సమయంలో కంప్యూటర్ల ధర రూ. 24,990 వరకు ఉంటుంది. అదనంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలుపై ఏకంగా రూ. 6వేల వరకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.
అమెజాన్ అసూస్ డేస్ సేల్, బ్యాంక్ ఆఫర్లు :
అమెజాన్ అసూస్ డేస్ ప్రమోషన్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యశ్ బ్యాంక్, BOB క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలతో కస్టమర్లు రూ.1500 సేవ్ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కొనుగోళ్ల ద్వారా వినియోగదారులు రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. యూసీఓ బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు రూ. 150 తగ్గింపును కూడా పొందవచ్చు.
అమెజాన్‌లో అసూస్ డేస్ బెస్ట్ ఆఫర్లు ఇవే :
అసూస్ క్రోమ్‌బుక్ CM14 ధర రూ. 24,990 :
ఆక్టాకోర్ సీపీయూ మీడియాటెక్ కోంపానియో 520, అసూస్ క్రోమ్‌బుక్ CM14కి పవర్ అందిస్తుంది. 14-అంగుళాల FHD డిస్‌ప్లే కలిగి ఉంది. 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ అనేవి ల్యాప్‌టాప్ ఫీచర్లు. ఇందులో క్రోమ్ OS రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ క్రోమ్‌బుక్ గ్రే కలర్ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.45 కిలోలు ఉంటుంది.
ASUS వివోబుక్ 15 :
అసూస్ Vivobook 15 ప్రాసెసర్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1215U కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ద్వారా సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 512GB స్టోరేజీ, 8GB ర్యామ్ ఉన్నాయి. విండోస్ 11 Home ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ 1.7 కిలోల బరువు ఉంటుంది. బ్యాటరీ 42WHr ఉండగా, కలర్ కూల్ సిల్వర్ కలిగి ఉంది.
అసూస్ TUF గేమింగ్ A15 ధర రూ. 63,990 :
అసూస్ AMD Ryzen 7 7435Hs చిప్‌సెట్‌ను కలిగిన గేమింగ్ ల్యాప్‌టాప్ (ASUS TUF) గేమింగ్ A15. ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ 15.6 అంగుళాలు. రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ ల్యాప్‌టాప్ రిఫ్రెష్ రేట్ 144 Hz కలిగి ఉంది. 512GB స్టోరేజీ, 16GB ర్యామ్ కలిగి ఉంది. విండోస్ 11 Home ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 2.3 కిలోలు ఉంటుంది.
అసూస్ AiO M3 : రూ. 56,990 :
డెస్క్‌టాప్ అసూస్ AiO M3 సిరీస్ 27-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. రిజల్యూషన్ Full HD కలిగి ఉంది. AMD రైజెన్ 5 7520U ప్రాసెసర్ ఇన్‌స్టాల్ అయింది. ఈ డెస్క్‌టాప్ ఆల్-ఇన్-వన్. ఇందులో 512GB SSD స్టోరేజ్, 16GB ర్యామ్ ఉన్నాయి. ఈ డివైజ్ బరువు 8.9 కిలోలు ఉంటుంది.
అసూస్ A3402 ధర రూ. 43,990 :
అసూస్ A3402 డిస్‌ప్లే 23.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, చిప్‌సెట్ ఇంటెల్ కోర్ i3-1315U 13వ జనరేషన్ కలిగి ఉంది. ఈ పీసీ 512GB స్టోరేజీ, 8GB RAM కలిగి ఉంది. ఈ డివైజ్ బరువు 5.4 కిలోలు. మూడు ఏళ్ల వారంటీతో వస్తుంది.
యాక్సెసరీలపై డీల్స్ ధర రూ. 1,349 :
ఈ సేల్ సమయంలో మీరు ASUS వైర్‌లెస్ కీబోర్డ్, సైలెంట్ ఆప్టికల్ మౌస్ సెట్ CW100 తక్కువ ధరకే పొందవచ్చు. బ్యాటరీ లైఫ్ చాలా కాలం ఉంటుంది. 600dpiతో 2.4GHz నానో రిసీవర్‌ను కలిగి ఉంది. డిజైన్ చాలా తేలికైనది. బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
బ్యాక్‌ప్యాక్ ASUS BP1504 : రూ. 990
ఈ ఫ్యాషన్ అసూస్ BP1504 బ్యాక్‌ప్యాక్ 15.6 అంగుళాల సైజులో ఉన్న కంప్యూటర్‌లకు సరిపోతుంది. ఇది డార్క్ గ్రే కలర్‌లో ఉంటుంది.