iPhone 17 Air : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ఎయిర్ కొత్త లీక్ ఇదిగో.. అత్యంత సన్నని ఐఫోన్ ఇదేనట.. భారీ డిజైన్ అదుర్స్..!

iPhone 17 Air : లీకైన రెండర్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ ఎడమ వైపున ఒకే రియర్ కెమెరా ఉంటుంది. కుడి వైపున మైక్రోఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఈ డిజైన్‌ను గూగుల్ పిక్సెల్ సిరీస్ కెమెరా బార్ డిజైన్‌తో కంపేర్ చేస్తున్నారు.

iPhone 17 Air : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ఎయిర్ కొత్త లీక్ ఇదిగో.. అత్యంత సన్నని ఐఫోన్ ఇదేనట.. భారీ డిజైన్ అదుర్స్..!

iPhone 17 Air

Updated On : March 16, 2025 / 3:33 PM IST

iPhone 17 Air Launch : ఆపిల్ ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్.. ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఐఫోన్ 17 గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆపిల్ అత్యంత సన్నని ఫోన్‌ ఇదే అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, కొత్త లీక్ ప్రకారం.. గతంలో ఊహించినంత సన్నగా ఉండకపోవచ్చు.

Read Also : Post Office Scheme : మహిళలకు బిగ్ అలర్ట్.. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ముగుస్తోంది.. మార్చి 31లోగా పెట్టుబడి పెట్టండి.. లేదంటే అధిక వడ్డీ కోల్పోతారు..!

ఈ మోడల్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్ సెప్టెంబర్ 2025లో లాంచ్ కావచ్చు. ఇటీవలి టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ కెమెరా బంప్ 4.4mm మందంగా ఉంటుంది. అయితే, ఐఫోన్ మొత్తం మందం 5.5mm ఉండే అవకాశం ఉంది. కెమెరా బంప్ కారణంగా మందమైన భాగం 9.5mm వరకు పెరుగుతుంది అనమాట.

ఐఫోన్ 17 ఎయిర్‌‌లో మార్పు ఇదే :
రుమర్లు నిజమైతే.. ఐఫోన్ 17 ఎయిర్ అనేక కొత్త మార్పులతో వచ్చే అవకాశం ఉంది. ఇందులో అతిపెద్ద మార్పు ఏమిటంటే.. ఆపిల్ “ప్లస్” మోడల్‌ను మొదటిసారిగా తొలగించనుంది. ఆ స్థానంలో సన్నని మోడల్‌ను అందించనుంది. గత ఐఫోన్‌ల కన్నా భిన్నమైన డిజైన్‌తో ఐఫోన్ 17 ఎయిర్ వచ్చే అవకాశం ఉంది.

ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మాదిరిగానే 6.9-అంగుళాల LTPO ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. కేవలం ఒక బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంచనాల ప్రకారం.. బ్యాటరీ 3,000mAh, 4,000mAh మధ్య ఉంటుందని సూచిస్తున్నారు. ప్రస్తుత ఐఫోన్‌ల కన్నా చాలా చిన్నది. ప్లస్ మోడల్‌ను రిప్లేస్ చేస్తూ.. ఐఫోన్ 17 ఎయిర్ అల్యూమినియంకు బదులుగా టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

సన్నని డిజైన్‌ అయినా ఫోన్ బెండ్ కాకుండా ఉండేలా చూస్తుంది. అయితే, ఈ ఐఫోన్ టైటానియం, అల్యూమినియం హైబ్రిడ్ ఫ్రేమ్‌ కలిగి ఉండవచ్చు. ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్ అల్యూమినియం ఫ్రేమ్‌లను కలిగి ఉన్నాయని పుకార్లు సూచిస్తున్నాయి. 2030 నాటికి పూర్తి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే లక్ష్యంతో రానుంది. లైనప్ వైర్డ్ ఛార్జింగ్ వేగంలో 30W నుంచి 35W వరకు స్వల్ప పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. తద్వారా ఛార్జింగ్ సమయం కొంచెం వేగంగా ఉంటుంది.

Read Also : Buying AC Home : కొత్త AC కొంటున్నారా? మీ ఇంటికి ఏసీని తెచ్చే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి!

ఐఫోన్ 17 ఎయిర్ నిజంగా సన్నగా ఉంటుందా? :
ఆపిల్ అల్ట్రా-స్లిమ్ మోడల్‌ను లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ఐఫోన్ మందం చర్చనీయాంశంగా మారింది. పాపులర్ ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ 5.5 మిమీ మందం కలిగి ఉండవచ్చు. కెమెరా బంప్ కొద్దిగా పెరగొచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ మొత్తం మందం 6 మి.మీ ఉండవచ్చు.

మరో లీక్ ప్రకారం.. ఈ ఫోన్ గత ఐఫోన్లలో కన్నా మందంగా ఉండవచ్చు. చైనీస్ బ్లాగింగ్ వెబ్‌సైట్ వీబోలోని ఐస్ యూనివర్స్, ఐఫోన్ 17 ఎయిర్ కెమెరా బంప్ 4mm ఉంటుందని అంచనా. మొత్తం మందం 9.5mm వరకు ఉండవచ్చు. లీకైన రెండర్‌ల ప్రకారం.. లెఫ్ట్ సైడ్ ఒకే రియర్ కెమెరా ఉంటుంది. రైట్ సైడ్ మైక్రోఫోన్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఈ డిజైన్‌ను గూగుల్ పిక్సెల్ సిరీస్ కెమెరా బార్ డిజైన్‌తో కంపేర్ చేస్తున్నారు.