Oppo F29 Series Launch : కొత్త ఫోన్ కావాలా? ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F29 Series Launch : ఒప్పో నుంచి సరికొత్త F29 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 20, 2025న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే Oppo F29 సిరీస్‌ IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. స్పెక్స్, ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F29 Series Launch : కొత్త ఫోన్ కావాలా? ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F29 Series Launch

Updated On : March 16, 2025 / 4:29 PM IST

Oppo F29 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఈ నెల 20న ఒప్పో నుంచి సరికొత్త 5జీ సిరీస్ వచ్చేస్తోంది. చైనీస్ టెక్ దిగ్గజం ఒప్పో లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌‌లో ఒప్పో F29, ఒప్పో F29 ప్రోలను మార్చి 20, 2025న లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది.

ఒప్పో F29 సిరీస్‌ ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒప్పో F29 ప్రో 5G హై-ఎండ్ వేరియంట్‌గా వస్తుందని భావిస్తున్నారు. కొన్ని ఆకట్టుకునే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కూడా కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌లతో ఒప్పో రెండూ IP68, IP69 రేటింగ్‌లతో వస్తాయని భావిస్తున్నారు.

Read Also : Buying AC Home : కొత్త AC కొంటున్నారా? మీ ఇంటికి ఏసీని తెచ్చే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల పాటు మునిగినా తట్టుకోగలవు. అలాగే, వేడి, చల్లటి నీటి జెట్‌లను కూడా తట్టుకోగలవు. ఈ ఫీచర్లతో పాటు, బ్రాండ్ ఇతర స్పెసిఫికేషన్ల గురించి రివీల్ చేయలేదు. కానీ, లీక్‌లు, పుకార్లు F29 సిరీస్ నుండి ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒప్పో F29 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :

డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది.
ప్రాసెసర్ : ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది.
ఒప్పో రెనో 12 ప్రో, CMF ఫోన్ 1 ఇటీవల లాంచ్ అయిన వివో T4x ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది.
కెమెరాలు : రియర్ కెమెరాలు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్.
సెకండరీ సెన్సార్ : డెప్త్ లేదా మాక్రో షాట్ల కోసం 2MP కెమెరా సెన్సార్ ఆప్షన్
ఫ్రంట్ కెమెరా : 16MP సెల్ఫీ షూటర్, హై క్వాలిటీ, వీడియో కాల్స్, ఏఐ సెల్ఫీల కోసం ఆప్టిమైజ్ ఆప్షన్లు
బ్యాటరీ, ఛార్జింగ్ : 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ భారీ 6,000mAh బ్యాటరీ, ఫాస్టెస్ట్ రీఛార్జింగ్ ఆప్షన్లు

స్టోరేజీ వేరియంట్లు, ప్రీమియం స్పెసిఫికేషన్లు :
8GB ర్యామ్ + 128GB స్టోరేజీ
8GB RAM + 256GB స్టోరేజీ
12GB ర్యామ్ + 256GB స్టోరేజీ

ఒప్పో F29 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
బేస్ వేరియంట్ ఒప్పో F29 5జీ ఫోన్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో రానుంది.
డిస్‌ప్లే : 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఫ్లాట్ డిజైన్‌ ఉండొచ్చు
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ద్వారా పవర్, పర్ఫార్మెన్స్, 5G కనెక్టివిటీని అందిస్తుంది.
కెమెరాలు : బ్యాక్ కెమెరా 50MP ప్రైమరీ సెన్సార్, OIS సపోర్టు లేకుండా పొందవచ్చు.
సెకండరీ సెన్సార్ : 2MP మోనోక్రోమ్ సెన్సార్, డెప్త్ లేదా పోర్ట్రెయిట్ ఎఫెక్ట్‌ మోడ్
ఫ్రంట్ కెమెరా : ప్రో మోడల్‌లో మాదిరిగా అదే 16MP సెల్ఫీ కెమెరా.
బ్యాటరీ- ఛార్జింగ్ : 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6,500mAh బ్యాటరీ

స్టోరేజీ వేరియంట్లు :
8GB ర్యామ్+ 128GB స్టోరేజీ
8GB ర్యామ్ + 256GB స్టోరేజీ

ఒప్పో F29 5G ప్రో వేరియంట్‌ కొన్ని ప్రీమియం ఫీచర్లు ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా సరసమైన ధరకు పవర్, బ్యాటరీ లైఫ్, కెమెరాలను అందిస్తుంది. భారత మార్కెట్లో ఒప్పో F29 సిరీస్ ధర అంచనా ధర వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Read Also : iPhone 17 Air : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ఎయిర్ కొత్త లీక్ ఇదిగో.. అత్యంత సన్నని ఐఫోన్ ఇదేనట.. భారీ డిజైన్ అదుర్స్..!

కానీ లీక్‌ల ప్రకారం ఒప్పో F29 ప్రో 5G ఫోన్ రూ. 30వేల లోపు ధర ఉంటుందని అంచనా. ఒప్పో F29 5జీ ఫోన్ ధర రూ. 25వేల లోపు ధర ఉంటుందని అంచనా. ఇదే ధరలతో ఒప్పో F29 సిరీస్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4, శాంసంగ్ గెలాక్సీ M14, వివో V30 సిరీస్ వంటి ఫోన్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఫోన్ అని చెప్పవచ్చు.