Lightest Smartphones : ఫోన్లు భలే ఉన్నాయి భయ్యా.. లైట్ వెయిట్ టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు చూశారా? ఏదో కొంటారో కొనేసుకోండి!

Lightest Smartphones : లైట్ వెయిట్ స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా? 200 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లిస్టు ఇదిగో..

Lightest Smartphones

Lightest Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో తేలికైన బరువు కలిగిన అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. లైట్ వెయిట్ ఫోన్లను కొనేందుకు వినియోగదారులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

స్క్రీన్ పొడవుగా ఉండి బ్యాటరీలు మరింత పవర్‌ఫుల్ ఉన్న కొన్ని బ్రాండ్ల ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో 200 గ్రామలు కన్నా తక్కువ బరువున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో టాప్ 5 జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Read Also : Lava Bold N1 Launch : లావా బోల్డ్ N1 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..

శాంసంగ్ గెలాక్సీ S25 :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. బెహెమోత్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 50MP ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా, 4000mAh బ్యాటరీని కలిగి ఉంది.

6.2-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 షీల్డ్, IP68 రేటింగ్‌తో వస్తుంది. శాంసంగ్ S24 వెర్షన్ల నుంచి మరింత అప్ గ్రేడ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ కేవలం 162 గ్రాముల బరువు ఉంటుంది.

షావోమీ CIVI 5 :
షావోమీ సివి సిరీస్ అదిరే స్పెషిఫికేషన్లతో వస్తుంది. స్టేబుల్ మిడ్‌రేంజ్ కర్వడ్ OLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌ను కలిగి ఉంది. స్లిమ్ లుక్స్, గ్లాస్ కోటింగ్, కలర్ ఆప్షన్లలో షావోమీ సివి 5 లుక్స్ అందిస్తోంది. ఈ షావోమీ సివి 5 ఫోన్ కేవలం 169 గ్రాముల బరువుతో వస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Lightest Smartphones) అద్భుతమైన ఫోన్. 144Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వడ్ pOLED స్క్రీన్, హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 కలిగి ఉంది. వీగన్ లెదర్ ఫినిషింగ్ గ్రిప్‌ కలిగి ఉంది. నాన్-స్టాప్ హ్యాండ్లింగ్‌కు సరైనది. ఈ మోటోరోలా ఫోన్ తేలికగా 174.9 గ్రాములు ఉంటుంది.

రియల్‌మి నార్జో 70x 5G :
రియల్‌మి నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ అదిరే ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. 188 గ్రాముల బరువు ఉంటుంది. 120Hz LCD స్క్రీన్, డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్, IP54 రేటింగ్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ ధర రూ. 12వేల కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

Read Also : Reliance Jio : చౌకైన ధరకే జియో కొత్త ప్లాన్‌.. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. 336 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

ఐక్యూ జెడ్ 9 5G :
ఐక్యూ Z9 5G ఫోన్ 188 గ్రాముల బరువు ఉంటుంది. డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తుంది. 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, OISతో కూడిన 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. సన్నని ఫ్రేమ్ లాంగ్ గేమింగ్ లేదా వీడియో ప్లే టైమ్ అందిస్తుంది.