మీ బడ్జెట్‌కు తగ్గ ఒక కొత్త శాంసంగ్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మిడ్ రేంజ్‌లో కొన్ని శాంసంగ్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి ఫీచర్లతో విడుదలైన శాంసంగ్ ఫోన్ల వివరాలు మీకోసం..
అద్భుత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. దీనిలో 6.7-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Samsung Exynos 2400e ప్రాసెసర్, 8GB RAMతో ఇది వచ్చింది. 50MP + 12MP + 8MP బ్యాక్ కెమెరాలు, 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4700mAh బ్యాటరీ, వేగవంతమైన చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.
అన్ని విధాలా చాలా మంది నచ్చుతున్న ఫోన్ ఇది. దీనిలో Exynos 1380 ప్రాసెసర్, 8GB RAM ఉంటాయి. 6.6 అంగుళాల FHD+ Super AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ దీని ప్రత్యేకత. 50MP + 8MP + 5MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.
తక్కువ బడ్జెట్‌లో చక్కటి పనితీరు కోరుకునేవారికి ఇది సరైనది. దీనిలో Exynos 1380 ప్రాసెసర్, 6GB RAM అమర్చారు. 6.6 అంగుళాల FHD+ Super AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ దీని సొంతం. 50MP + 8MP + 2MP కెమెరా సెటప్, 13MP సెల్ఫీ కెమెరా దీనిలో ఉన్నాయి. 6000mAh భారీ బ్యాటరీ ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ Exynos 1480 ప్రాసెసర్, 8GB RAMతో వచ్చింది. 6.7 అంగుళాల Super AMOLED Plus డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఆకట్టుకుంటాయి. 50MP + 8MP + 2MP కెమెరాలు, 12MP ముందు కెమెరా దీనిలో ఉంది. 5000mAh బ్యాటరీ ఉంది.
ఇది ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే ఫోన్. Snapdragon 8 Elite ప్రాసెసర్, 12GB RAMతో వచ్చింది. 6.2 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా, 4000mAh బ్యాటరీ దీనిలో ఉంటాయి. ప్రీమియం మిడ్రేంజ్ విభాగంలో ఇది ఒక మంచి ఫోన్.