కేక పెట్టించే కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. రూ.25 వేలలోపే వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

ఇది 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.

కేక పెట్టించే కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. రూ.25 వేలలోపే వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Updated On : May 29, 2025 / 9:13 AM IST

స్మార్ట్‌ఫోన్‌తోనే మీ ఫొటోగ్రఫీ హాబీని కొనసాగించాలనుకుంటున్నారా? రూ.25 వేల లోపు ధరలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? భారత మార్కెట్లో కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇటువంటి ఫీచర్లతోనే వచ్చాయి. మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఇటువంటి మూడు స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం..

రియల్‌మీ P3 Pro
రియల్‌మీ P3 Pro రూ.19,999కే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఆక్టా కోర్ కాన్ఫిగరేషన్‌తో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 2.5 GHz (సింగిల్ కోర్), 2.4 GHz (ట్రై కోర్), 1.8 GHz (క్వాడ్ కోర్) క్లాక్ స్పీడ్‌లతో వచ్చింది. 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. బ్యాక్‌సైడ్‌ 50 MP, 2 MP సెన్సార్లతో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్, 16 MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంది. 6000 mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. రూ.20,000 ధరలోపు అతిపెద్ద స్క్రీన్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి.

Also Read: అతి తక్కువ ధరకు వచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే..

మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ధర రూ.22,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ సెటప్‌తో స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో వచ్చింది. 2.4 GHz (క్వాడ్ కోర్), 1.8 GHz (క్వాడ్ కోర్)తో అందుబాటులో ఉంది. ఇది 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది.

ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ P-OLED స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. ఇది రిచ్ కలర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. కెమెరా కాన్ఫిగరేషన్‌లో 50 MP + 13 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ ఉంది.

నథింగ్ Phone 3a
నథింగ్ Phone 3a ధర రూ.24,999. Snapdragon 7s Gen 3 చిప్‌సెట్‌తో వచ్చింది. 2.5 GHz (సింగిల్ కోర్), 2.4 GHz (ట్రై కోర్), 1.8 GHz (క్వాడ్ కోర్) వద్ద పనిచేసే ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఇది 8 GB RAM, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వచ్చింది.

స్క్రీన్ 6.77 అంగుళాలు.. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లెక్సిబుల్ AMOLED టెక్నాలజీతో వచ్చింది. బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50 MP + 8 MP + 50 MP సెన్సార్లు ఉన్నాయి. ముందు కెమెరాలో 32 MP సెన్సార్ ఉంది. ఇది 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.