Truecaller Launches UPI-based Verified Badge For Android Users ( Image Source : Google )
Truecaller Verified Badge : ప్రముఖ స్వీడన్‌కు చెందిన స్పామ్, కాల్-బ్లాకింగ్ అప్లికేషన్ ట్రూకాలర్ భారతీయ ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్ల కోసం సరికొత్త బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త వెరిఫైడ్ బ్యాడ్జ్ సర్వీసు యూజర్లను సరైన పేర్లను ప్రభుత్వ మద్దతుతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా వారి ఐడెంటిటీని ధృవీకరించేందుకు అనుమతిస్తుంది.
కంపెనీ ప్రకారం.. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోని ప్రీమియం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్‌లో వెరిఫైడ్ బ్యాడ్జ్‌కి సపోర్ట్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. కొత్త వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ యూపీఐ ద్వారా అథెంటికేషన్ పూర్తిచేయొచ్చు.
యూపీఐ నుంచి పొందిన సమాచారం ఆధారంగా వినియోగదారుల పేరును ఎంచుకోవడం ద్వారా అథెంటికేషన్ పూర్తి చేసేందుకు వీలుంటుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్ ట్రూకాలర్ మొబైల్ యూజర్లలో అత్యంత డిమాండ్ ఉన్న ఫీచర్‌లలో ఒకటిగా మారింది. చాలా మంది యూజర్లు పారదర్శకంగా యాక్సస్ చేసేలా ఉండాలని కోరుతున్నారు. యూజర్ల డిమాండ్ మేరకు ట్రూకాలర్ వెరిఫికేషన్ మెథడ్ పునరుద్ధరించింది.
ఈ ఫీచర్ సాయంతో ట్రూకాలర్ డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మరింత సెక్యూరిటీగా ఉండేలా లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా అధికారిక గుర్తింపు వ్యవస్థలతో ఇంటిగ్రేట్ అయ్యే వెరిఫైడ్ ప్రొఫైల్ విశ్వసనీయతను వినియోగదారులకు అందిస్తుంది. డిజిటల్ కమ్యూనికేషన్‌లు తప్పనిసరిగా మారుతున్న తరుణంలో వినియోగదారులు ట్రూకాలర్ వెరిఫైడ్ బ్యాడ్జ్ మరింత సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌ను అందించేలా చర్యలు తీసుకుంటోంది.