TrueCaller ID Feature : గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్లలో ట్రూకాలర్ లైవ్ కాలర్ ఐడీలు.. కంపెనీ సీఈఓ వెల్లడి!

TrueCaller ID Feature : ఐఫోన్‌లోని ట్రూకాలర్ ఆండ్రాయిడ్‌లో మాదిరిగా లేదు. ప్రైవసీ, యాక్సెస్ సమస్యల కారణంగా యాప్ పాపులర్ ఫీచర్లు కాలర్ ఐడీ యాప్‌లో కనిపించలేదు. గత ఏడాదిలో ట్రూకాలర్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.

Truecaller will finally show live caller IDs on iPhones ( Image Source : Google )

TrueCaller ID Feature : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఐఫోన్‌లో ట్రూ కాలర్ యాప్ వాడుతున్నారా? ఇందులో సరికొత్త ఫీచర్ వచ్చింది చెక్ చేశారా? ట్రూ కాలర్ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త లైవ్ కాలర్ ఐడీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఐఫోన్ కాలర్ వివరాలను సెర్చ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. లేటెస్ట్ ఫీచర్ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iPhone 16 Series Launch : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కావాలా? ఈ నెల 13 నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.. ధరల వివరాలివే..!

ఐఓఎస్ 18తో ట్రూకాలర్‌‌ ఇష్యూ ఫిక్స్ :
ఐఫోన్‌లోని ట్రూకాలర్ ఆండ్రాయిడ్‌లో మాదిరిగా లేదు. ప్రైవసీ, యాక్సెస్ సమస్యల కారణంగా యాప్ పాపులర్ ఫీచర్లు కాలర్ ఐడీ యాప్‌లో కనిపించలేదు. గత ఏడాదిలో ట్రూకాలర్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. తద్వారా యాప్ ఐఫోన్‌లతో మెరుగ్గా పనిచేస్తుంది. అయితే, కాలర్‌ను గుర్తించడానికి యూజర్లు సిరితో ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు అది మారనుంది. ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలాన్ మామెడి కొత్త ఐఓఎస్ 18 అప్‌గ్రేడ్ ప్రవేశపెట్టడంతో ట్రూకాలర్ చివరకు ఐఫోన్‌లలో పనిచేస్తుందని ధృవీకరించారు.

ట్రూకాలర్ సీఈఓ ఐఓఎస్ 18 రిలీజ్ డాక్యుమెంటేషన్ స్క్రీన్‌షాట్‌లను కూడా ఆయన షేర్ చేశారు. ఐఫోన్లలో ఇప్పుడు లైవ్ కాలర్ ఐడీ లుక్అప్ ఫీచర్‌ను కలిగి ఉంటాయని వెల్లడించారు. కొత్త ఏపీఐ ట్రూకాలర్ వంటి డెవలపర్‌లు తమ సర్వర్‌ల నుంచి సమాచారాన్ని పొందేందుకు, ఇన్‌కమింగ్ కాల్స్ కోసం ప్రైవసీని కాపాడే విధంగా లైవ్ కాలర్ ఐడీని అందించడానికి అనుమతిస్తాయని అన్నారు.

అప్పట్లో ట్రూకాలర్‌పై తీవ్ర ఆరోపణలు :
ట్రూకాలర్‌తో ప్రైవసీ అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేకించి 2022 తర్వాత కారవాన్ నిర్వహించిన పరిశోధనలో యూజర్ల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని ట్రూకాలర్ సేకరించిందని ఆరోపించింది. అయితే, ట్రూకాలర్ ఈ వాదనలను తీవ్రంగా ఖండించింది. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, తప్పు డేటా ఆధారంగా ఉందని పేర్కొంది. యూజర్ల డేటా విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని కంపెనీ గట్టిగా ఖండించింది.

ప్రైవసీతో ఐఫోన్లలో లిమిట్ యాక్సస్ :
ప్రైవసీ, భద్రతపై ఆపిల్ కఠినమైన ఐఓఎస్ పరిమితుల కారణంగా ట్రూకాలర్ ఐఫోన్‌లలో పరిమిత యాక్టివిటీని కలిగి ఉంది. ఈ పరిమితులు ట్రూకాలర్ వంటి థర్డ్-పార్టీ యాప్‌లను రియల్ టైమ్‌లో ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ యాక్సెస్ చేయకుండా, ఇంటరాక్ట్ చేయకుండా నిరోధించాయి. ఆండ్రాయిడ్ మాదిరిగా కాకుండా, ఐఓఎస్ ఫోన్ కాల్ లాగ్‌ను యాక్సెస్ చేయడానికి యాప్‌లను అనుమతించదు. ట్రూకాలర్ స్పామ్ కాల్‌లను ఆటోమాటిక్‌గా గుర్తించకుండా, ఫ్లాగ్ చేయకుండా నియంత్రిస్తుంది. అదనంగా, ప్రస్తుతం, ఐఫోన్లలోని ట్రూకాలర్ తెలియని నంబర్‌లను గుర్తించడానికి ఎస్ఎంఎస్ లేదా కాల్ లాగ్‌లను స్కాన్ చేయదు. వినియోగదారులు కాల్ చేసిన తర్వాత యాప్‌లో తెలియని నంబర్‌ల కోసం మాన్యువల్‌గా సెర్చ్ చేయాలి.

ఈ సెట్టింగ్ ఆన్ చేసినా అంతే :
ట్రూకాలర్ ఐఫోన్ పరిమిత కాలర్ ఐడీ యాక్టివిటీని అందిస్తున్నప్పటికీ, వినియోగదారులు ఇప్పటికీ ఫోన్ సెట్టింగ్‌లలో “కాల్ బ్లాకింగ్ & ఐడెంటిఫికేషన్” ఆప్షన్ యాప్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఒకవేళ ఉన్నా యాప్ ప్రస్తుత డేటాబేస్ ఆధారంగా కాలర్ ఐడీని మాత్రమే డిస్‌ప్లే చేయగలదు. ఆండ్రాయిడ్‌లో ఉన్నట్లుగా ఇన్‌కమింగ్ కాల్‌లను డైనమిక్‌గా గుర్తించదు. ఇంకా, ఐఓఎస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని యాప్‌లు రన్ చేయవచ్చో నియంత్రిస్తుంది. యాప్ ఓపెన్ అయితే తప్ప కాల్‌లను గుర్తించడం వంటి రియల్ టైమ్ టాస్కులను ట్రూకాలర్ చేయలేదని చెప్పవచ్చు.

Read Also : Narayana Murthy Parenting Advice : మళ్లీ వివాదాస్పదంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. పేరెంటింగ్ సలహాపై నెటిజన్లు మండిపాటు..!

ట్రెండింగ్ వార్తలు