Edit Tweet: నెటిజెన్ల ఎదరు చూపుకు ఫలితం దక్కిందా? ట్వీట్ ఎడిట్‭పై ట్విట్టర్ సంచలన ప్రకటన

కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ కొనుగోలు అంశంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకసారి ఎడిట్ బటన్ గురించి ప్రస్తావించారు. అయితే ఆ డీల్ కుదరకపోవడంతో ఇక ఆ ప్రస్తావన ఆటకెక్కినట్లైంది. అయితే విచిత్రంగా స్వయంగా ట్విట్టరే ఎడిట్ ప్రస్తావన చేయడం గమనారహం. ప్రస్తుతం ఇది టెస్టింగులో ఉందని ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది. విజయవంతమైతే అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

Edit Tweet: ట్విట్టర్‭లో నెటిజెన్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. ఎడిట్ బటన్ లేకపోవడం. 280 క్యారెక్టర్లకు మించి అవకాశం లేని ఒక ట్వీట్‭లో ఏదైనా తప్పు పోయిందంటే సరి చేసుకునే వీలు లేదు. ట్వీట్ డిలీట్ చేయడం అంటే కొందరికి చాలా కాంప్లికేటెడ్ విషయం. అందుకే నెటిజెన్లు ఎప్పటి నుంచో ఎడిట్ బటన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ట్విట్టర్ దీనిపై ఎప్పుడూ సానుకూలంగా స్పందించలేదు.

కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ కొనుగోలు అంశంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకసారి ఎడిట్ బటన్ గురించి ప్రస్తావించారు. అయితే ఆ డీల్ కుదరకపోవడంతో ఇక ఆ ప్రస్తావన ఆటకెక్కినట్లైంది. అయితే విచిత్రంగా స్వయంగా ట్విట్టరే ఎడిట్ ప్రస్తావన చేయడం గమనారహం. ప్రస్తుతం ఇది టెస్టింగులో ఉందని ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది. విజయవంతమైతే అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నెటిజెన్లకు ట్వీట్లలో తప్పులు పోయాయన్న ఇబ్బంది ఇక ఉండదు.

ఈ విషయమై గురువారం ట్విట్టర్ ఒక ట్వీట్ చేసింది. ‘ఇది ఒక ఎడిటెడ్ ట్వీట్. మేము దీనిని పరిశీలస్తున్నాం’ అని ఈ ట్వీట్‭లో రాసుకొచ్చారు. ఎడిట్ చేసిన ట్వీట్ కింద ఎడిట్ చేసిన లేబుల్, సమయం, కనిపిస్తాయి. నిజానికి ఇతర సోషల్ మీడియా వేదికల్లో పోస్టు అనంతరమే ఎడిటెడ్‭ అని కనిపించదు. కానీ ట్విట్టర్ మాత్రం.. ఎడిటెడ్ అంశాన్ని ట్వీట్‭కు అనుసంధానంగానే చూపించనుంది.

Kejriwal Vs Modi: సిసోడియాను రెండు సార్లు అరెస్ట్ చేస్తే మేమే గెలుస్తాం.. బీజేపీతో కేజ్రీవాల్

ట్రెండింగ్ వార్తలు