Kejriwal Vs Modi: సిసోడియాను రెండు సార్లు అరెస్ట్ చేస్తే మేమే గెలుస్తాం.. బీజేపీతో కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. ఈ విశ్వాస పరీక్షలో ఆప్ ప్రభుత్వం 58 ఓట్లు సాధించింది. ఈ విశ్వాస పరీక్షను సీఎం కేజ్రీవాలే ప్రవేశపెట్టడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఇటీవల ఆరోపించింది

Kejriwal Vs Modi: సిసోడియాను రెండు సార్లు అరెస్ట్ చేస్తే మేమే గెలుస్తాం.. బీజేపీతో కేజ్రీవాల్

we will get 2 percent more votes if bjp attests sisodia says kejriwal

Kejriwal Vs Modi: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేసి తమకు గొప్ప బహుమతి ఇచ్చారని, అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేయడం వల్ల గుజరాత్‌లో తమ పార్టీకి రెండు శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు.

సిసోడియాపై సీబీఐ దాడుల తర్వాత గుజరాత్‌లో తమ పార్టీ ఓట్లు నాలుగు శాతం పెరిగాయని కేజ్రీవాల్ చెప్పారు. ఆయనను అరెస్టు చేస్తే ఇది 6 శాతానికి పెరుగుతుందని, రెండుసార్లు అరెస్టు చేస్తే గుజరాత్‌లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమవుతుందని రుజువు చేయడానికే తాము విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారలేదన్నారు. తన పిల్లలిద్దరూ ఐఐటీలో చదివారని, దేశంలోని ప్రతి బిడ్డకూ అలాంటి విద్యనే అందించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. ఈ విశ్వాస పరీక్షలో ఆప్ ప్రభుత్వం 58 ఓట్లు సాధించింది. ఈ విశ్వాస పరీక్షను సీఎం కేజ్రీవాలే ప్రవేశపెట్టడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఇటీవల ఆరోపించింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని ఆప్ నేతలు చెప్పారు. దీంతో బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాలే నేరుగా తనకున్న మెజారిటీని నిరూపించుకోవాలనుకున్నారు. దీనికోసం ఆయనే విశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ పరీక్షలో కేజ్రీవాల్ విజయం సాధించారు.

Nitish kumar-CMKCR: మీడియా ప్రశ్న వినగానే లేచి వెళ్లిపోబోయిన నితీశ్.. చెయ్యిపట్టి కూర్చోబెట్టిన కేసీఆర్