Nitish kumar-CMKCR: మీడియా ప్రశ్న వినగానే లేచి వెళ్లిపోబోయిన నితీశ్.. చెయ్యిపట్టి కూర్చోబెట్టిన కేసీఆర్
బిహార్ ప్రభుత్వంలో సైతం జేడీయూ, ఆర్జేడీలతో కాంగ్రెస్ పార్టీ పోత్తులో ఉంది. అంతే నితీశ్ పరోక్షంగానైనా కాంగ్రెస్‌తో పొత్తులోనే ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీని కాదని ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి అంటూ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ బిహార్ పర్యటనకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంలోనే.. ‘‘ప్రధాని అభ్యర్థికి రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారా నితీశ్ కుమార్‌కు మద్దతు ఇస్తారా?’’ అని మీడియా ప్రశ్నించింది.

Nitish Kumar stands up to leave presser on PM candidate question then KCR holds him
Nitish kumar-CMKCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి అభ్యర్థి గురించి మీడియా ప్రతినిధులు కేసీఆర్‌ను ప్రశ్నించారు. అంతే.. నితీశ్‌కు చిర్రెత్తుకొచ్చి, ‘‘ఎందుకు ఇదే ప్రశ్న అడుగుతారు?’’ అంటూ లేచి నిల్చున్నారు. అంతేనా.. ‘‘ఇవన్నీ వట్టి బోగస్ ప్రశ్నలు.. వెళ్లిపోదాం పదా’’ అంటూ కేసీఆర్‌ను పిలిచారు. అయితే పలుమార్లు నితీశ్ చేయ్యి పట్టుకుని కూర్చోమంటూ కేసీఆర్ సర్ధి చెప్పారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ కుమార్ ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థని ఆర్జేడీ కీలక నేత తేజశ్వీ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. ఎలాగైనా తన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకోవాలని నితీశ్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారు. ఒకవేళ బీజేపీయేతర ప్రధాని అభ్యర్థి అంటే.. దేశంలో రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని కాదని ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాల్సి వస్తే వేరే విషయం. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రధాని కుర్చీని వదులుకోవడానికి సిద్ధపడదు. విపక్షాల నుంచి కూడా ప్రధాని అభ్యర్థిత్వంపై చాలా మంది ఆశతోనే ఉన్నారు. ఈ నేపధ్యంలో నితీశ్ తన అభ్యర్థిత్వాన్ని ఎంత వరకు నిలబెట్టుకోగలరనే ఆసక్తి పెరిగింది.
ఇక బిహార్ ప్రభుత్వంలో సైతం జేడీయూ, ఆర్జేడీలతో కాంగ్రెస్ పార్టీ పోత్తులో ఉంది. అంతే నితీశ్ పరోక్షంగానైనా కాంగ్రెస్‌తో పొత్తులోనే ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీని కాదని ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి అంటూ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ బిహార్ పర్యటనకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంలోనే.. ‘‘ప్రధాని అభ్యర్థికి రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారా నితీశ్ కుమార్‌కు మద్దతు ఇస్తారా?’’ అని మీడియా ప్రశ్నించింది.
If KCR had any hopes of leading the 3rd/4th/5th front – Nitish Kumar has effectively ended those by embarrassing him in the most brutal manner pic.twitter.com/NuskfJLUtP
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 1, 2022
ఈ ప్రశ్న వినగానే నితీశ్ కుమార్ లేచి నిల్చొని ‘‘ఎందుకు ఇదే ప్రశ్న అడుగుతారు?’’ అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ‘‘ఇవన్నీ వట్టి బోగస్ ప్రశ్నలు.. వెళ్లిపోదాం పదా’’ అంటూ కేసీఆర్‌ను పిలిచారు. అయితే కేసీఆర్ మాత్రం మీడియా సమావేశాన్ని కొనసాగిస్తూ నితీశ్ చెయ్యి పట్టుకుని కూర్చోమని అడిగారు. అయినప్పటికీ నితీశ్ మీడియాతో కాస్త వాగ్వాదంగా తన అసంతృప్తిని వెల్లగక్కారు. కేసీఆర్ పలుమార్లు నితీశ్ చెయ్యి పట్టుకుని కూర్చోమని చెప్పారు. ఎట్టకేలకు ఆయన కుర్చీలో ఆసీనులయ్యారు. ‘‘ప్రధాని అభ్యర్థినైనా ప్రధానినైనా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడే ఎందుకంత తొందర’’ అంటూ మీడియాకు కేసీఆర్ సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.