Twitter New Feature : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. మీ ట్వీట్.. ఆ ఫ్రెండ్స్ మాత్రమే చూడొచ్చు!

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ (Twitter) కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ట్విట్టర్ త‌మ యూజర్ల కంటెంట్‌ను ఎవ‌రితో షేర్ చేసుకోవాలో ఎంచుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను యూజర్ల ప్రైవసీ కోసం ప్రవేశపెడుతోంది.

Twitter New Features Considering New ‘trusted Friends’ Feature

Twitter new ‘Trusted Friends’ feature : మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ (Twitter) కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ట్విట్టర్ త‌మ యూజర్ల కంటెంట్‌ను ఎవ‌రితో షేర్ చేసుకోవాలో ఎంచుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను యూజర్ల ప్రైవసీ కోసం ప్రవేశపెడుతోంది. అదే.. ట్ర‌స్ట్‌డ్ ఫ్రెండ్స్ (Trusted Friends Feature) ఫీచ‌ర్‌.. ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్స్ త‌ర‌హాలోనే ఈ ఫీచర్ ఉంటుంది. ఇకపై యూజర్లు పర్సనల్, ప్రొఫిషనల్‌గా తమ ట్వీట్లను షేర్ చేయొచ్చు.

ఈ మేరకు ట్విట్టర్ డిజైనర్ Andrew Courter వెల్లడించారు. ట్విట్ట‌ర్ లో ఏదైనా ట్వీట్ పెడితే అది అందరికి కనిపిస్తుంది. కొద్ది మంది స్నేహితులకు మాత్రమే కనిపించేలా ఉండే ఆప్షన్ లేదు. దాంతో యూజర్లు కొంత ఇబ్బందికి గురికావాల్సి వస్తోంది. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదని అంటోంది ట్విట్టర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలను క్లోజ్ ఫ్రెండ్స్ మాత్ర‌మే చూసే ఫీచ‌ర్ ఉంది. ఇప్పుడు ట్విట్టర్ కూడా ఇన్ స్టా ఫీచ‌ర్ మాదిరిగానే ట్ర‌స్ట్‌డ్ ఫ్రెండ్స్ (Trusted Friends) ఫీచర్ తీసుకురావాల‌ని ట్విట్ట‌ర్ నిర్ణయించింది.

కొన్నిసార్లు మ‌న ట్వీట్ల‌ను కొందరికి కనిపించకూడదని అనుకుంటాం.. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ కావొచ్చు.. క్లోజ్ ఫ్రెండ్స్ (Close Friends) కావొచ్చు.. లేదా కుటుంబ సభ్యులు కావొచ్చు.. అందరికి కనిపించకుండా కొంతమంది స్నేహితులకు మాత్రమే కనిపించేలా ఈ ఫీచర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఇప్ప‌టిదాకా ఇలాంటి వాటి కోసం ఒకటి పర్సనల్, రెండోది ఫ్రొఫెషనల్ ట్విట్టర్ అకౌంట్లను వాడాల్సి వచ్చేది.

ఇకపై ఈ ఫీచర్ వచ్చాక రెండు అకౌంట్లు అక్కర్లేదు. ఒకే అకౌంట్లో ఎవరికి కనిపించాలో వారికి మాత్రమే కనిపించేలా పోస్టులు పెట్టుకోవచ్చు. ట్ర‌స్ట్‌డ్ ఫ్రెండ్స్ ఫీచ‌ర్ సాయంతో మీకు నచ్చినవారితో మాత్రమే ట్వీట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి సెట్ చేస్తే.. మీరు ఎంచుకున్న గ్రూపు వారికి మాత్రమే మీ ట్వీట్ కనిపిస్తుంది. అలాగే ట్వీట్ల‌ను కేట‌గిరైజ్ చేసే Facets ఫీచర్ కూడా తీసుకురానుంది.