Twitter-India Map : ఇండియా మ్యాప్ వివాదం.. ట్విట్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!

ఇండియా మ్యాప్ వివాదంలో ట్విట్టర్‌కు ఉచ్చు బిగుస్తోంది. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్‌ మహేశ్వరిపైనా కేసు నమోదైంది. ఇండియా మ్యాప్ వివాదంపైనా యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Twitter India Map

Twitter India MD Manish Maheshwari named in FIR: ఇండియా మ్యాప్ వివాదంలో ట్విట్టర్‌కు ఉచ్చు బిగుస్తోంది. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్‌ మహేశ్వరిపైనా కేసు నమోదైంది. ఇండియా మ్యాప్ వివాదంపైనా యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ట్విట్టర్ ఇండియా చీఫ్‌ మనీశ్ మహేశ్వరి పేరును కూడా చేర్చారు. అయితే ఇప్పటికే మత విద్వేషాలను రెచ్చగొట్టే విషయంపై మనీశ్‌పై కేసు నమోదు అయింది. ఈ నెలలోనే ఆయనపై యూపీలో రెండో కేసు నమోదు కావడం ట్విట్టర్ తీరకు నిదర్శనంగా మారింది.

ట్విట్టర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్ కేంద్రం వార్నింగ్ తో వెనక్కి తగ్గింది. తప్పుడు మ్యాప్ వెబ్ సైట్ నుంచి తొలగించింది. జమ్ముకశ్మీర్, లడఖ్ ను భారత్ వెలుపల చూపించడాన్ని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సైతం ట్విట్టర్ చర్యను తీవ్రంగా పరిగణించాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా ట్విట్టర్ తీరు మార్చుకోవడం లేదు. భారత ఐటీ చట్టాలను సైతం ట్విట్టర్ లెక్కచేయడం లేదు. ఐటీ నిబంధనలను అమలు విషయంలో కేంద్రంతో వార్ నడుస్తోంది.

తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో..ట్విట్టర్‌.. ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. అందుకు కొంత సమయం కావాలని కోరింది. ప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతర కీలక నేతలకు చెందిన బ్లూ టిక్ మార్కులను తొలగించడం వివాదాస్పదమైంది. అనంతరం అకౌంట్ రీయాక్టివేట్ చేసింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ కూడా బ్లాక్ అయింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్‌‌కు వార్నింగ్ మెసేజ్ పంపడంతో గంట తర్వాత అకౌంట్‌‌‌ను అన్ బ్లాక్ చేసేంది ట్విట్టర్.