Upcoming Phones
Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. ఇప్పటికే ఆగస్టు నెలలో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్, వివో V60 ఫోన్ లాంచ్ (Upcoming Phones) కాగా, వచ్చే సెప్టెంబర్ 2025లో మరెన్నో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. నివేదికల ప్రకారం.. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది. అందులో కొత్త ఐఫోన్ 17 ఎయిర్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే, శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ కూడా ఉండొచ్చు.
ఒప్పో, లావా, ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు మిడ్-రేంజ్, ఎంట్రీ-లెవల్ ఆఫర్‌లను విస్తరిస్తున్నాయి. భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయాలని భావిస్తున్నారు. మోటోరోలా రేజర్ 60 క్రిస్టల్ ఎడిషన్‌ను కూడా ప్రవేశపెట్టింది. వచ్చే సెప్టెంబర్ 2025లో జరిగే లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 9న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ ఇంకా దీనిపై ఎలాంటి ధృవీకరణ చేయలేదు. పుకార్లు నిజమైతే.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొత్త డిజైన్, ఆకర్షణీయమైన స్పెషిఫికేషన్లతో వస్తుంది. ట్రంప్ సుంకాల అనిశ్చితి కారణంగా అన్ని ఐఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 FE :
శాంసంగ్ కూడా సెప్టెంబర్ 5, 2025న IFA బెర్లిన్‌లో గెలాక్సీ S25 FE లాంచ్ చేయనుంది. స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్, ట్రిపుల్ కెమెరా, 5 కలర్ ఆప్షన్లను కలిగి ఉండొచ్చు. 6.7-అంగుళాల అమోల్డ్ ప్యానెల్, 8GB వరకు, దాదాపు 5,000mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 62,999 ధరకు లాంచ్ కావొచ్చు.
ఒప్పో F31 సిరీస్ సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 14 మధ్య భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో ఒప్పో F31, ఒప్పో F31 ప్రో, ఒప్పో F31 ప్రో ప్లస్ ఉండవచ్చు. లీక్‌ల ప్రకారం.. అన్ని మోడళ్లలో 7,000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఒప్పో ప్రో ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ద్వారా పవర్ అందిస్తుంది. అయితే, ఒప్పో F31ప్రో, స్టాండర్డ్ మోడల్‌లు వరుసగా డైమన్షిటీ 7300, డైమన్షిటీ 6300 చిప్‌సెట్ కలిగి ఉండొచ్చు.
మోటోరోలా రేజర్ 60 స్వరోవ్స్కీ ఎడిషన్ :
భారత మార్కెట్లో సెప్టెంబర్ 1న మోటోరోలా రెజర్ 60 స్వరోవ్స్కీ ఎడిషన్‌ను లాంచ్ చేయనుంది, ఇందులో 3D క్విల్టెడ్ ఫినిషింగ్‌లో 35 స్వరోవ్స్కీ క్రిస్టల్‌లు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. ఈ మోటోరోలా ఫోన్ 6.9-అంగుళాల LTPO pOLED డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరాతో సహా రెజర్ 60 స్పెసిఫికేషన్‌లు ఉండొచ్చు. ఈ మోటోరోలా ఫోన్ 30W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు.
లావా అగ్ని 4 :
నివేదికల ప్రకారం.. లావా అగ్ని 3 అప్‌గ్రేడ్ వెర్షన్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. అయితే, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, డిజైన్ మరిన్నింటి వివరాలు రివీల్ కాలేదు. కానీ, ఈ లావా ఫోన్ గత మోడల్‌తో పోలిస్తే ఎక్కువ ధర ఉండవచ్చు.