×
Ad

Upcoming Smartphones : కొత్త ఫోన్ కావాలా బ్రో.. వచ్చే డిసెంబర్‌లో రాబోయే 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

Upcoming Smartphones : వచ్చే డిసెంబర్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు, అమెజింగ్ కెమెరాలతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

Upcoming Smartphones

Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేటెస్ట్ స్మార్ట్‌వేర్‌తో 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు రెడీగా ఉండండి. వచ్చే డిసెంబర్ నెలలో సరికొత్త 5జీ ఫోన్లు రాబోతున్నాయి. భారత మార్కెట్లో మూడు వేర్వేరు బ్రాండ్‌లు అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో (Upcoming Smartphones) వివో X300 సిరీస్, వన్‌ప్లస్ 15R, రెడ్‌మి నోట్ 15 ఉన్నాయి. అన్ని ఫీచర్లు, అంచనా ధరలు ఇలా ఉన్నాయి. మీరు ఫోటోగ్రఫీ, మల్టీ టాస్కింగ్ లేదా గేమింగ్ కోసం చూస్తుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌లు మీకు అద్భుతంగా ఉంటాయి.. ఏయే బ్రాండ్ల ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధర ఎంత ఉండొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. వివో X300 సిరీస్ :
వివో X300 సిరీస్ డిసెంబర్ 2న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని అంచనా. వివో X300 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.31-అంగుళాల కాంపాక్ట్ 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. అదే సమయంలో వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా అదే ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ, 6.78-అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తుంది.

Read Also : Best Realme Phones : పండగ చేస్కోండి.. రూ. 30వేల లోపు ధరలో 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు మీకోసం.. ఏది కొంటారో కొనేసుకోండి!

ఈ రెండు ఫోన్‌లు కూడా మీడియాటెక్ డైమన్షిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను 16GB LPDDR5X ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.0/4.1 స్టోరేజ్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయొచ్చు. వివో X300, వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల అంచనా ధర బేస్ వేరియంట్‌కు వరుసగా రూ. 69,999, రూ. 99,999 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

2. వన్‌ప్లస్ 15R :

వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ కూడా డిసెంబర్ 2025లో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. డ్యూయల్-కెమెరా సెటప్‌ కూడా పొందవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చు. ఈ ఫోన్ ధర సుమారు రూ. 44,999 ఉంటుందని అంచనా.

3. రెడ్‌మి నోట్ 15 :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ గత ఆగస్టులో చైనా మార్కెట్లో లాంచ్ అయింది. డిసెంబర్ 2025లో భారత మార్కెట్లో రూ. 19,999 ప్రారంభ ధరతో లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB లేదా 8GB ర్యామ్ కాన్ఫిగరేషన్‌లలో ఉండొచ్చు. స్టోరేజ్ ఆప్షన్‌లలో 128GB లేదా 256GB ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉపయోగించి స్టోరేజీ పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 5800mAh నుంచి 7000mAh బ్యాటరీ ప్యాక్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు.