Best Realme Phones : పండగ చేస్కోండి.. రూ. 30వేల లోపు ధరలో 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు మీకోసం.. ఏది కొంటారో కొనేసుకోండి!

Best Realme Phones : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 30వేల లోపు ధరలో 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..

1/6Best Realme Phones
Best Realme Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు రియల్‌మి ఫ్యాన్స్ అయితే ఇది మీకోసమే.. తక్కువ ధరలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే రియల్‌మి ఫోన్లను సొంతం చేసుకోండి. ప్రస్తుతం మార్కెట్లో రియల్‌మి కొన్ని మంచి బడ్జెట్ ఫోన్లను ఆఫర్ చేస్తోంది. సరసమైన ధరలో బెస్ట్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ కొనేసుకోండి. ప్రస్తుతం మార్కెట్లో రూ. 30వేల లోపు ధరలో రియల్‌మి 15 ప్రో నుంచి రియల్‌మి P3 అల్ట్రా వరకు 6 కిర్రాక్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
2/6Realme P3 Ultra
రియల్‌మి P3 అల్ట్రా (రూ. 21,999) : రియల్‌మి P3 అల్ట్రా 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీతో వస్తుంది. 50MP + 8MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
3/6Realme 14 Pro plus 5G
​రియల్‌మి 14 ప్రో+ 5G (రూ. 23,999) : రియల్‌మి 14 ప్రో ప్లస్ 5G ఫోన్ 50MP + 50MP + 8MP బ్యాక్ కెమెరా సెటప్ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. 1B కలర్స్, 120Hz 1500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ యూనిట్ భారీ బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
4/6Realme 14 Pro
రియల్‌మి 14 ప్రో (రూ. 24,999) : రియల్‌మి 14 ప్రో 6.77-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 1B కలర్స్, 120Hz 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 6000mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ ద్వారా పవర్ పొందుతుంది. కెమెరాల విషయానికొస్తే.. డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
5/6Realme 15T
రియల్‌మి 15T (రూ. 19,999) : రియల్‌మి 15Tలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌తో 60W వైర్డ్ ఛార్జర్‌తో కూడిన భారీ 7000mAh బ్యాటరీ కలిగి ఉంది. 50MP + 2MP బ్యాక్ కెమెరా సెటప్ 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంది. బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ కోసం చూస్తున్న వారికి స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆప్షన్.
6/6Realme 15 Pro
రియల్‌మి 15 ప్రో (రూ. 27,479) : రియల్‌మి 15 ప్రో డ్యూయల్ 50MP కెమెరా సెన్సార్లు, 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే, ఈ స్మార్ట్‌ఫోన్ 1B కలర్స్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 80W వైర్డ్ ఛార్జర్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.