Upcoming Mobiles in March 2025 : మార్చిలో రిలీజయ్యే స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లాంచ్ తేదీలు, ఫీచర్లు, ధరలు మీకోసం.. ఓసారి లుక్కేయండి!

Upcoming smartphones : వచ్చే మార్చిలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్ ఫోన్ 3ఎ, పోకో M7 5జీ, శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్, షావోమీ 15 అల్ట్రా, వివో T4x, పోకో M7 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Upcoming smartphones

Upcoming smartphones 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. వచ్చే మార్చిలో ఎండబ్ల్యూసీ ఈవెంట్ జరుగనుంది. ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు మార్చి 2025 లాంచ్‌ కోసం రెడీగా ఉన్నాయి. ఇందులో Samsung, Nothing, Xiaomi, Vivo, Poco నుండి కొత్త ఫోన్ మోడళ్లు ఉన్నాయి.

నథింగ్, పోకో వంటి కంపెనీలు ఇప్పటికే తమ లాంచ్ ప్లాన్‌లను ధృవీకరించాయి. స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికులకు బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, వచ్చే నెల వరకు వేచి ఉండాల్సిందే. అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌లు, అధిక సామర్థ్యం గల బ్యాటరీలు, అడ్వాన్స్‌డ్ చిప్‌సెట్‌లు ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి..

శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్ :
మార్చి 2025లో శాంసంగ్ 3 కొత్త A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు Galaxy A56, Galaxy A36, Galaxy A26 లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో “Looks that Slay” “More Awesome” అనే ప్రమోషనల్ ట్యాగ్‌లైన్‌లు కనిపిస్తున్నాయి. ఈ మూడు ఫోన్లు వన్ యూఐ 7.0తో పాటు 6 OS అప్‌డేట్‌లతో వస్తాయని భావిస్తున్నారు. గెలాక్సీ A56 ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్, ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉండవచ్చు. 50MP ప్రైమరీ, 12MP అల్ట్రా-వైడ్, 5MP మాక్రో కెమెరా సెటప్‌, 12MP ఫ్రంట్ షూటర్‌తో పాటు అందించవచ్చు.

45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కూడా అందించవచ్చు. శాంసంగ్ గెలాక్సీ A36 స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 3 లేదా 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్, 6.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే, 50MP+8MP+5MP బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి 25W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ సపోర్టు ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ A26 బహుశా Exynos 1280 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. నాచ్ డిస్‌ప్లేతో పాటు స్లిమ్ ప్రొఫైల్‌ను కూడా కలిగి ఉండవచ్చు.

నథింగ్ ఫోన్ (3a) సిరీస్ :
నథింగ్ ఫోన్ (3a) సిరీస్ మార్చి 4న లాంచ్ కానుంది. ఇందులో నథింగ్ ఫోన్ (3a), నథింగ్ ఫోన్ (3a) ప్రో ఉండవచ్చు. లీకైన రెండర్‌ల ప్రకారం.. బ్యాక్ ట్రాన్స్‌పరంట్ గ్లిఫ్ లైటింగ్‌తో బ్లాక్ అండ్ వైట్ వేరియంట్‌లతో రావచ్చు. ఈ రెండు మోడళ్లు ఒకే విధమైన డిజైన్‌ను కలిగి ఉండవచ్చు.

కానీ, కెమెరా ప్లేస్‌మెంట్‌లో తేడా ఉంటుంది. స్టాండర్డ్ ఫోన్ (3a) ట్రిపుల్-కెమెరా సెటప్‌తో పిల్-ఆకారపు మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ప్రో వేరియంట్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో సహా సర్కిల్ మాడ్యూల్‌ను కలిగి ఉండవచ్చు.

ఈ 2 స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతాయని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ (3a) 128GB లేదా 256GB స్టోరేజీతో 8GB లేదా 12GB ర్యామ్ కలిగి ఉండవచ్చు. నథింగ్ ప్రో మోడల్ 12GB RAM, 256GB స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. 5,000mAh బ్యాటరీ, 6.77-అంగుళాల 120Hz డిస్ప్లే, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ప్రో వెర్షన్ కెమెరా సెటప్ స్టాండర్డ్ మోడల్ కన్నా డిఫరెంట్‌గా ఉంటుంది.

షావోమీ 15 అల్ట్రా :
షావోమీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ (Xiaomi 15 Ultra)ను చైనాలో లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్‌తో 6.73-అంగుళాల ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ ఫోన్ ధర 6,499 యువాన్లు (సుమారు రూ. 78,024) ఉండవచ్చు. చైనాలో అందుబాటులో ఉంటుంది. మార్చి 2న ఎండబ్ల్యూసీ 2024న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుంది. అదే తేదీన భారత మార్కెట్లో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

లైకాతో రూపొందిన ఈ క్వాడ్-కెమెరా సెటప్‌ లో లైటింగ్ ఫోటోగ్రఫీకి 4.3x జూమ్‌తో కూడిన కొత్త 200MP పెరిస్కోప్ లెన్స్ ఉంది. ప్రైమరీ కెమెరాలో f/1.63 ఎపర్చర్‌తో 50ఎంపీ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ 90W వైర్డు, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని అందించనుంది.

కానీ, Qi2 సపోర్టు లేదు. ఐపీ68 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. కెమెరా కంట్రోలింగ్స్ కోసం ఆప్షనల్ ఫొటోగ్రఫీ కిట్‌ ఉండవచ్చు. ప్రస్తుతానికి గ్లోబల్ ధర, లభ్యత తెలియదు. రాబోయే (MWC 2025)లో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

వివో T4x :
మార్చిలో వివో T4x మోడల్ లాంచ్ కానుంది. వివో T4 సిరీస్‌ను మరింత విస్తరించనుంది. 728,000 కన్నా ఎక్కువ AnTuTu స్కోరుతో డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 50MP ఏఐ కెమెరా, వినూత్న ఏఐ టూల్స్ అందించగలదు.

కస్టమైజ్ నోటిఫికేషన్‌ల కోసం ఈ ఫోన్ డైనమిక్ లైట్‌ను కలిగి ఉండవచ్చు. ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారత మార్కెట్లో రూ. 15వేల కన్నా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

పోకో M7 5జీ :
పోకో ఈ మార్చిలో భారత మార్కెట్లోకి పోకో M7 5G లాంచ్ చేయనుంది. 12GB RAM (6GB ఫిజికల్ + 6GB వర్చువల్)తో రూ. 10వేల కన్నా తక్కువ ధరకే లభించే స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు.
స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది.

పోకో M6 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. పోకో M7 ప్రో బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ ఫోన్ మ్యాట్-ఫినిష్ గ్రీన్-బ్లూ డిజైన్, క్వాడ్-కటౌట్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్ మరింత ఆకర్షణీయంగా ఉండవచ్చు.