NPCI New Guidelines
NPCI New Guidelines : దేశంలో యూపీఐ వాడకం బాగా పెరిగిపోయింది. అన్నింటికి యూపీఐనే.. ఏ డిజిటల్ పేమెంట్ చేయాలన్నా యూపీఐ ద్వారానే తెగ (NPCI New Guidelines) వాడేస్తున్నారు. యూటీలిటీ బిల్లుల దగ్గర నుంచి కిరాణ సరుకుల వరకు అన్నింటికి ఇప్పుడు యూపీఐపైనే ఆధారపడుతున్నారు.
అంతగా యూపీఐకి డిమాండ్ పెరిగింది. భారత్‌లో డిజిటల్ లావాదేవీల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారానే ఎక్కువ పేమెంట్లు జరుగుతున్నాయి. యూపీఐ వాడకం భారీగా పెరగడంతో యూపీఐ పేమెంట్ల సమయంలో తీవ్ర అంతరాయాలు తలెత్తుతున్నాయి.
ఇటీవలి అంతరాయాల తర్వాత యూపీఐ సేవల స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త పరిమితులను ప్రవేశపెట్టింది. ఇటీవలి నెలల్లో యూపీఐ సేవలు తరచుగా ఊహించని విధంగా నిలిచిపోతున్నాయి. ఎక్కువ మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
Read Also : UPI Payments : యూజర్లకు బిగ్ అలర్ట్.. UPI పేమెంట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే? NPCI వన్‌షాట్ ఆన్సర్..!
ఇలాంటి అంతరాయాలతో లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ మెరుగుపరిచేందుకు NPCI కొత్త పరిమితులను విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బ్యాలెన్స్ చెకింగ్ లిమిట్ విధించింది. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
బ్యాలెన్స్ చెక్ లిమిట్ : ఒక్కో యాప్‌కు 50 సార్లు :
బ్యాంక్ అకౌంట్ లింక్ చెకింగ్ : రోజుకు 25 సార్లు :