USB Charger Scam Rampant In India_ Here's What It Is And How To Stay Safe
USB Charger Scam : మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నారా? అయితే, మీ డివైజ్‌లను పబ్లిక్ ఛార్జింగ్ యూఎస్‌బీ కనెక్టర్లతో ఛార్జ్ చేయకండి. దేశంలో యూఎస్‌బీ ఛార్జర్ స్కామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.
ప్రత్యేకించి విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, బస్టాండ్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పోర్టల్‌లను ఉపయోగించవద్దు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ డివైజ్‌లతోనే మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, పబ్లిక్ ఛార్జింగ్ పెట్టే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరించింది.
Read Also : పెట్రోల్ ధరలను మరోసారి భారీగా పెంచిన పాకిస్థాన్.. లీటర్ ధర ఎంతుందో తెలుసా?
యూఎస్‌బీ ఛార్జర్ స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఈ ఛార్జర్ స్కామ్ కారణంగా మీ విలువైన డేటాతో పాటు నగదు, ఇతర ముఖ్యమైన వివరాలను సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉంది. ఇలాంటి స్కామ్‌ల నుంచి మీ డివైజ్‌లను ఎలా సురక్షింగా ఉంచుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు యూఎస్ బీ ఛార్జర్ స్కామ్ గురించి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రిస్క్ : సైబర్ నేరగాళ్లు ఎక్కువగా విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, బస్టాండ్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగించుకుంటారు.
జ్యూస్-జాకింగ్ : మాల్‌వేర్ ఎఫెక్ట్ అయిన యూఎస్‌బీలతో బస్సు, రైల్వే స్టేషన్‌లలో డివైజ్‌లను ఛార్జింగ్ చేయడం వల్ల యూజర్లు జ్యూస్-జాకింగ్ అనే సైబర్ దాడులకు గురవుతారు. జ్యూస్ జాకింగ్ అనేది సైబర్ దాడిలో వ్యూహంగా చెప్పవచ్చు. ఇందులో సైబర్ నేరస్థులు యూజర్ డేటాను దొంగిలించడానికి లేదా వాటికి కనెక్ట్ చేసిన డివైజ్‌లలో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి పబ్లిక్ యూఎస్‌బీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగిస్తారు.
Safety tip of the day: Beware of USB charger scam.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scam #cyberalert #CSK #cybersecurityawareness pic.twitter.com/FBIgqGiEnU
— CERT-In (@IndianCERT) March 27, 2024
కొన్నిసార్లు అనుకోకుండా వినియోగదారులు తమ డివైజ్‌లను అలాంటి ఛార్జింగ్ పోర్ట్‌లలో పెట్టినప్పుడు సైబర్-నేరస్థులు మీ డేటాను ఆపివేయవచ్చు లేదా కనెక్ట్ చేసిన డివైజ్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. తద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. మాల్వేర్ లేదా (ransomware) ఇన్‌స్టాలేషన్ చేసి మీ డివైజ్ ఎన్‌క్రిప్షన్ కలిగి ఉన్నప్పటికీ నేరగాళ్ల చేతుల్లోకి డేటా వెళ్లిపోతుంది.
ఎలా సురక్షితంగా ఉండాలంటే? :
ఒకవేళ, సైబర్ మోసం జరిగినట్టుగా మీకు అనుమానం వస్తే.. (www.cybercrime.gov.in)లో రిపోర్టు చేయండి లేదా 1930కి కాల్ చేయండి.
Read Also : IPL 2024 : ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త..!