Valentines Day Gifts : మీ గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? స్మార్ట్‌వాచ్ నుంచి ఫోన్ వరకు.. రూ.5వేల లోపు బెస్ట్ వాలైంటెన్స్ డే గాడ్జెట్లు మీకోసం..!

Valentines Day Gifts : ప్రేమికుల రోజున మీ భాగస్వామికి అందమైన బహుమతిని ఇవ్వాలనుకుంటే.. రూ. 5వేల కన్నా తక్కువ ధరకే అనేక గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌బడ్‌ల నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకు ఏదైనా కొనుగోలు చేయవచ్చు.

Valentines day Gadgets Gifts under Rs 5k including smartwatch

Valentines Day Gifts : వాలెంటైన్స్ డే మొదలైంది. ఈ వాలెంటైన్స్ డే వీక్ సందర్భంగా ప్రతిఒక్కరూ తమకు ఇష్టమైనవారికి ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. మీరు ఇంకా మీ భాగస్వామికి లేదా ప్రియురాలికి ఏదైనా బహుమతి కొనకపోతే.. వారిని బాధపెట్టాలనుకోరు.

అందులోనూ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఏం చేస్తారు.. రూ.5వేల లోపు బెస్ట్ గాడ్జెట్‌లను బహుమతులుగా కొనుగోలు చేసి మీ భాగస్వామికి బహుమతిగా ఇవ్వవచ్చు. ఏయే గాడ్జెట్లను గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇందులో మీకు నచ్చిన గాడ్జెట్ ఎంచుకుని మీ భాగస్వామిని సర్‌‌ప్రైజ్ చేయండి.

Read Also : Apple iPhone SE 4 : ఆపిల్ లవర్స్‌కు పండుగే.. అతి తక్కువ ధరకే ఐఫోన్ SE 4 వస్తోంది.. డిజైన్, ఫీచర్లు కెవ్వు కేక.. గెట్ రెడీ!

రెడ్‌మి వాచ్ 5 లైట్ :
స్మార్ట్‌వాచ్ అనేది ఒక ఆకర్షణీయమైనది. స్టైలిష్ లుక్ ఇవ్వడమే కాదు.. హెల్త్, ఫిట్‌నెస్‌పై కూడా అవగాహన కల్పిస్తుంది. మీ వైఫ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఫిట్‌నెస్ ప్రియులైతే.. మీరు వారికి కొత్త రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ను రూ.3,399కి బహుమతిగా ఇవ్వవచ్చు. 1.96 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటర్నల్ జీపీఎస్ కూడా ఇంటిగ్రేడ్ అయి ఉంటుంది. 5ATM దుమ్ము, నీటి నిరోధకతను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ కూడా కలిగి ఉంది.

ఐటెల్ జెనో 10 :
మీకు కొత్త ఫోన్ కావాలా? పెద్ద బడ్జెట్ లేదని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ.. మీరు ఈ ఐటెల్ ఫోన్ కేవలం రూ. 5వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్‌పై రూ. 2వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.5,799గా ఉంది. 6.6 అంగుళాల HD+డిస్‌ప్లే , 8MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో :
మీ వాలెంటైన్ డే సందర్భంగా మ్యూజిక్ వినడం ఇష్టమైతే.. మీరు ఈ స్టైలిష్ ఇయర్‌బడ్‌లను వన్‌ప్లస్ నుంచి రూ. 3,099 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డులతో వీటిపై రూ.300 అదనపు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్‌తో 44 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేయగలవు. ఈ ఇయర్‌బడ్‌లు 12.4mm డైనమిక్ ఆడియో డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కూడా అందిస్తాయి.

బోట్ స్టోన్ స్పిన్క్స్ ప్రో :
మీరు పార్టీ మూడ్‌ను క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? బోట్ (boAt) నుంచి వచ్చిన ఈ స్పీకర్లు బెస్ట్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. వీటిని అమెజాన్ నుంచి రూ. 2,499 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో టైప్-సి ఛార్జింగ్ అందుబాటులో ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 8 గంటల వరకు మ్యూజిక్ వినవచ్చు. ఇంటర్నల్ మైక్రోఫోన్‌తో కాలింగ్ కూడా సాధ్యమే. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం ఆర్‌జీబీ ఎల్ఈడీలను కలిగి ఉంది. అంతేకాదు.. స్పీకర్‌లో (AUX) పోర్ట్ కూడా ఉంది.

Read Also : Loan Foreclosure : ఇంటి, కారు లోన్ క్లోజ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు!

శాండిస్క్ అల్ట్రా డ్యూయల్ డ్రైవ్ గో :
మీకు నచ్చిన ఫొటోలను సేవ్ చేసుకునేందుకు మీకు అదనపు స్టోరేజీ అవసరమైతే, ఈ పెన్ డ్రైవ్ కొనుగోలు చేయొచ్చు. ఈ డ్యూయల్ డ్రైవ్ గో పెన్ డ్రైవ్ కొనేందుకు కేవలం రూ. 1,899 మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుంది. 50 కూపన్ డిస్కౌంట్ లభించే ఈ 128GB స్టోరేజ్ మోడల్ అద్భుతంగా సరిపోతుంది.

మీ ఫోటోలు, వీడియోలను ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ స్టోర్ చేయగలదు. యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ సాయంతో ఈ పెన్-డ్రైవ్‌ను నేరుగా మీ ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు. అయితే, ఈ పెన్ డ్రైవ్ 64GB వేరియంట్‌ ధర కేవలం రూ.699 నుంచి ప్రారంభమవుతుంది.