×
Ad

Vivo Diwali : రూ. 101కే వివో ఫోన్..కండీషన్ అప్లై!

ఫెస్టివ్ సీజన్ సందర్భంగా...భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. రూ. 101కే ఫోన్ ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అయితే..దీనికో కండిషన్ పెట్టింది.

  • Published On : October 28, 2021 / 06:07 PM IST

Vivo

Vivo Diwali Offer : దివాళీ వచ్చేస్తోంది. ఈ పండుగను క్యాష్ చేసుకోవాలని పలు సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లతో ముందుకొస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించాయి. ప్రధానంగా సెల్ ఫోన్ కంపెనీలు అట్రాక్టివ్ ఆఫర్లతో మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. సెల్ ఫోన్ సంస్థల్లో ఒకటైన వివో కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా…భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. రూ. 101కే ఫోన్ ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అయితే..దీనికో కండిషన్ పెట్టింది.

Read More : Covid Variant AY.4.2 : 5 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు..థర్డ్ వేవ్ సంకేతమా!

బజార్ ఫైనాన్స్ తో టైఅప్ అయ్యింది కనుక…బజాజ్ కస్టమర్లు సొంతం చేసుకొనే వీలుంది. అయితే..రూ. 15 వేల రూపాయల కంటే..ఎక్కువ ధర ఉన్న వివో ఫోన్లను ముందుగా 101 రూపాయలు చెల్లించి…తీసుకోవచ్చని, ఆ తర్వాత నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో నెలనెలా ఈఎంఐ కట్టే అవకాశాన్ని అందిస్తున్నారు. వివో వై73, వివో వీ 21 రేంజ్‌, వివో వై33ఎస్, వివో ఎక్స్ 70 సిరీస్‌ స్మార్ట్ ఫోన్ల‌పై ఈ ఆఫ‌ర్లు ల‌భించ‌నున్నాయి.

Read More : Women Eat Walls : ఇంటి గోడల్ని తినేస్తున్న మహిళ..పక్కింటి గోడల్ని కూడా వదలటంలేదు..

ఇందులో వివో ఎక్స్ 70 సిరీస్ కొనాలంటే…ఐసీఐసీఐ బ్యాంకు సిటీ బ్యాంకు, కొటాక్ మహీంద్ర బ్యాంకు, హెడీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే…10 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. మరో విషయం…వివో ఫోన్లపై ఈ ఆఫర్లను పొందాలంటే..వివో ఇండియా స్టోర్ లో ఫోన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని లేదా ఈ కామర్స్ సైట్లలో ఈ ఆఫర్లపై కొనుక్కొనే ఛాన్స్ ఉంది. ఈ ఆఫర్ నవంబర్ 07 వరకు మాత్రమే ఉండనుంది.