Covid Variant AY.4.2 : 5 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు..థర్డ్ వేవ్ సంకేతమా!

     కోవిడ్ థర్డ్ వేవ్ పై భయాందోళనలు నెలకొన్న వేళ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవడం ఇప్పుడు భారత్ కు

Covid Variant AY.4.2 : 5 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు..థర్డ్ వేవ్ సంకేతమా!

Covid

Covid Variant  AY.4.2       కోవిడ్ థర్డ్ వేవ్ పై భయాందోళనలు నెలకొన్న వేళ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవడం ఇప్పుడు భారత్ కు తలనొప్పిగా తయారైంది. కర్ణాటక,మహారాష్ట్ర,కేరళ,ఆంధ్రప్రదేశ్. కేరళ,తెలంగాణ రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ లో కూడా తాజాగా డెల్టా వేరియంట్ AY.4.2 కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

AY.4.2 వేరియంట్ యూ కె, జర్మనీ మరియు రష్యాలలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమవుతుందని భయపడుతున్నారు. అటువంటి వేరియంట్ ఇండియాలో కూడా కేసులను నమోదు చేయడం ఇప్పుడు ఆందోళనకు కారణం గా మారింది. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి పరిశోధించే పనిలో ఉన్నారు.

కర్ణాటకలో AY.4.2 వేరియంట్ కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెండు AY.4.2 కోవిడ్ వేరియంట్ కేసులు కనుగొనబడ్డాయని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ తెలిపారు. నిపుణులతో చర్చించిన తర్వాత కొత్త మార్గదర్శకాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. AY.4.2 కొత్త కోవిడ్ వేరియంట్‌ కారణంగా బ్రిటన్, రష్యాలో థర్డ్ వేవ్  ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు.  కోవిడ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ ని కలిసి  తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యల గురించి చర్చిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. మూడో వేవ్ వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

అయితే ఈ కొత్త వేరియంట్‌.. సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సంతతికి చెందినది అని.. దీని వల్ల కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, ప్రస్తుతం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 16,156 కొత్త కేసులు నమోదు కాగా.. 733 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,60,989 యాక్టీవ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ALSO READ Aircraft Vadodara Restaurant: విమానం లాంటి రెస్టారెంట్.. పెట్టుబడి రూ.1.40కోట్లు