Vivo T4 5G Launch : భారీ బ్యాటరీతో Vivo T4 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 22నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే? ఫుల్ డిటెయిల్స్!

Vivo T4 5G Launch : వివో నుంచి సరికొత్త Vivo T4 5G సిరీస్ లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 22న భారత మార్కెట్లో వివో T4 ప్రవేశపెట్టేందుకు వివో సన్నాహాలు చేస్తోంది.

Vivo T4 5G Launch

Vivo T4 5G Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సరికొత్త Vivo T4 5G ఫోన్ తీసుకొస్తోంది. వివో ఇటీవలే వివో V సిరీస్, వివో X సిరీస్‌లలో కొత్త ఫోన్‌లను ప్రకటించింది. భారత మార్కెట్లో ఏప్రిల్ 22న వివో T4ని లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఈ ఫోన్‌కు సంబంధించి వివో ఇప్పటికే టీజర్‌లను రిలీజ్ చేయనుంది. రాబోయే ఫోన్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. 7,300mAh అతిపెద్ద బ్యాటరీతో రానుంది. అదే బ్యాటరీతో ఐక్యూ Z10 లాంచ్ అయింది.

Read Also : Samsung One UI 7 : శాంసంగ్ వాడుతున్నారా? మీ ఫోన్‌కు వన్ UI 7 అప్‌డేట్ వచ్చిందోచ్.. ఇప్పుడే చెక్ చేసి అప్‌డేట్ చేసుకోండి..!

ఆసక్తికరంగా, రాబోయే వివో T4 ఫోన్ స్పెషిఫికేషన్లు లాంచ్‌కు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వివో T4 ఫోన్ భారత్ ధర ఎంత ఉంటుందో ఇంకా రివీల్ చేయలేదు. కానీ, లీకైన స్పెషిషికేషన్లు ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.

వివో T4 స్పెక్స్, ఫీచర్లు లీక్ :
వివో T4 ఫోన్ భారీ 7,300mAh బ్యాటరీతో స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లలో వస్తుంది. ఈ ఫోన్ దేశంలోనే అత్యంత సన్నని బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఎమరాల్డ్ బ్లేజ్ ఎడిషన్ కేవలం 7.89mm మందం, 199 గ్రాముల బరువు కలిగి ఉంది.

వివో T4 5G ఫోన్ కూడా ఫాంటమ్ గ్రే షేడ్‌లో వస్తుందని భావిస్తున్నారు. ఒకే ప్యాకేజీలో లాంగ్‌టైమ్ బ్యాటరీని కోరుకునే యూజర్లకు బెస్ట్ అని చెప్పవచ్చు. వివో ఈ ఫోన్ కోసం అడ్వా్న్స్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు చెబుతోంది.

బ్లూవోల్ట్ బ్యాటరీ మెటీరియల్స్, థర్డ్-జెన్ సిలికాన్, గత వెర్షన్ కన్నా దాదాపు 16 శాతం పవర్ అందించనుంది. ఈ ఫోన్ కార్బన్ నానోట్యూబ్ కండక్షన్, ఎలక్ట్రోడ్ రీషేపింగ్, నానో కేజ్ స్ట్రక్చర్ కూడా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ 90W వైర్డు ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో వస్తుంది. రివర్స్ ఛార్జింగ్‌ను కూడా ఉంటుంది. వినియోగదారులు ఇతర ఫోన్లను రీఛార్జ్ చేసేందుకు బైపాస్ ఛార్జింగ్‌ చేయొచ్చు. గేమింగ్ లేదా భారీ వినియోగం సమయంలో ప్రాసెసర్‌కు నేరుగా పవర్ పంపే ఈ ఫీచర్ హీట్ తగ్గించే కెపాసిటీ కూడా ఉంది.

డిస్‌ప్లే విషయానికొస్తే.. వివో T4 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ క్వాడ్-కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 5,000నిట్స్ వరకు ఉండొచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్ కూడా ఉండవచ్చు. ఈ రెండూ సాధారణంగా వివో హై-ఎండ్ ఫోన్‌లలో కనిపిస్తాయి.

హుడ్ కింద, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ అందించనుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15తో వస్తుంది. కెమెరా సెక్షన్‌లో T4 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ IMX882 సెన్సార్‌తో పాటు 2MP సెకండరీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ సెటప్‌ను అందించవచ్చు. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : iOS 18.5 Public Beta : ఆపిల్ లవర్స్ కోసం iOS 18.5 పబ్లిక్ బీటా రిలీజ్.. ఐఫోన్ యూజర్లు ఇప్పుడే ఇలా చెక్ చేసుకోండి..!

భారత్‌లో వివో T4 ధర (అంచనా) :
వివో T4 ఫోన్ ధర రూ.20వేలు నుంచి రూ.25వేల మధ్య ఉంటుందని అంచనా. భారత మార్కెట్లో వివో T3 సిరీస్ రూ.19,999కి లాంచ్ కాగా, వివో T2 మోడల్ రూ.18,999కి అమ్మకానికి వచ్చింది. రాబోయే వివో T4 మోడల్‌ ధర కూడా ఇంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు. లాంచ్ ఈవెంట్‌కు ఇంకా కొంత సమయం ఉంది. ఈ వివో ఫోన్ భారత్ ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.