Samsung One UI 7 : శాంసంగ్ వాడుతున్నారా? మీ ఫోన్‌కు వన్ UI 7 అప్‌డేట్ వచ్చిందోచ్.. ఇప్పుడే చెక్ చేసి అప్‌డేట్ చేసుకోండి..!
Samsung One UI 7 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్లలో కొత్త వన్ యూఐ 7 అప్‌డేట్ రిలీజ్ అయింది. మీరు ఫోన్ సెట్టింగ్స్‌లో చెక్ చేసి అప్‌డేట్ చేసుకోండి.

Samsung One UI 7
Samsung One UI 7 : శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రిలీజ్ చేస్తోంది. దశలవారీగా మోడల్ లైనప్ ఆధారంగా వన్ యూఐ 7 అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.
ప్రత్యేకించి గెలాక్సీ S24 సిరీస్ కోసం ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7.0 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్, గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్లు ఉన్నాయి. ప్రారంభ ఫర్మ్‌వేర్‌లో బగ్ తర్వాత కొన్ని రోజుల క్రితమే అప్‌డేట్ పాజ్ అయింది. ఇప్పుడు, శాంసంగ్ ఈ బగ్ ఇష్యూను పరిష్కరించింది. కొత్త ఫర్మ్‌వేర్‌ను రిలీజ్ చేస్తోంది.
సామ్‌మొబైల్ (SamMobile) ప్రకారం.. ప్రస్తుతం శాంసంగ్ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ స్వదేశమైన దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది. అయితే, అతి త్వరలో ఇతర దేశాల్లోని శాంసంగ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కొత్త వెర్షన్‌ను ఎలా గుర్తించాలంటే.. మీ ఫోన్‌లో బిల్డ్ నంబర్ (S928NKSU4BYD9) కోసం చెక్ చేయండి.
ఇంకా తమ ఫోన్‌లను అప్‌డేట్ చేయని యూజర్లు అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు పిన్‌లు, ప్యాటర్న్స్ లేదా ఫింగర్ ఫ్రింట్ వంటి లాక్ స్క్రీన్ సెక్యూరిటీని తాత్కాలికంగా నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఎందుకంటే.. లాక్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇష్యూ కావచ్చు. కొత్త అప్‌డేట్ స్టేబుల్‌గా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
మునుపటి వెర్షన్‌ను ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్న శాంసంగ్ యూజర్లు ఈ కొత్త స్టేబుల్ అప్‌డేట్ స్వీకరిస్తారా లేదా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. శాంసంగ్ వన్ యూఐ 7 రోల్ అవుట్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి మరిన్ని డివైజ్‌లలో One UI 7 అప్‌డేట్ అందించనుందని భావిస్తున్నారు. మీరు గెలాక్సీ S24 ఫోన్ వాడుతుంటే ఈ అప్‌డేట్ మీకు అందుబాటులోకి రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
Read Also : iPhone 16e Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 16e కొనేసుకోండి.. డోంట్ మిస్!
Settings > Software Update > Download చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఈ కొత్త అప్‌డేట్ కోసం మాన్యువల్‌గా కూడా చెక్ చేయవచ్చు. వన్ UI 7 అనేక కొత్త ఫీచర్లు అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఈ అప్‌డేట్ మీ ఫోన్‌లో వచ్చేందేమో ఓసారి చెక్ చేసుకోండి.