Vivo T4 Ultra
Vivo T4 Ultra : వివో కొత్త ఫోన్ చూశారా? భారత మార్కెట్లోకి వివో T4 సిరీస్‌ను రిలీజ్ చేసింది. కొత్త వివో T4 అల్ట్రాతో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. వివో T4 అల్ట్రా (Vivo T4 Ultra) కొత్త పెరిస్కోప్ లెన్స్ కలిగి ఉంది. వివో T3 అల్ట్రా కన్నా బిగ్ అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ 6.67-అంగుళాల OLED స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. పవర్‌ఫుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
జూన్ 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్,రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. వివో T4 అల్ట్రా ఫోన్ 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఐ కేర్ సర్టిఫికేషన్, IP64 సర్టిఫికేషన్ వంటి ఫీచర్లను అందిస్తుంది. వివో T4 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్లు, లభ్యత వివరాలను ఓసారి లుక్కేయండి..
వివో T4 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
వివో T4 అల్ట్రా ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 2160Hz PWM, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమన్షిటీ 9300 ప్లస్ ద్వారా Immortalis-G720 జీపీయూతో వస్తుంది. 12GB వరకు LPDDR5 ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. వివో T4 అల్ట్రా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh సింగిల్-సెల్ బ్యాటరీని కలిగి ఉంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్OS 15తో వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ వివో T4 అల్ట్రా ఫోన్ 50MP OIS మెయిన్ కెమెరాతో పాటు 50MP సోనీ IMX 882 పెరిస్కోప్, 8MP అల్ట్రావైడ్ షూటర్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ 4K, EISతో 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ వివో ఫోన్ డ్యూయల్ 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, OTG అందిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.
వివో T4 అల్ట్రా 5G ధర :
వివో T4 అల్ట్రా ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ.37,999 కాగా, 12GB+256GB ధర రూ.39,999. టాప్-ఎండ్ 12GB ర్యామ్, 512GB వేరియంట్ ధర రూ.41,999కు లభ్యం కానుంది. కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. మెటోర్ గ్రే, ఫీనిక్స్ గోల్డ్ వంటి కలర్ వేరియంట్లు ఉన్నాయి.