Vivo T5 Lite 5G : వివోనా మజాకా.. ఈ కొత్త వివో 5జీ ఫోన్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర జస్ట్..

Vivo T5 Lite 5G : వివో టీ5 లైట్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. 44W ఫాస్ట్ ఛార్జింగ్, 6,500mAh బ్యాటరీతో మీ బడ్జెట్ ధరలోనే లభ్యమవుతుంది. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Vivo T5 Lite 5G

  • 44W ఫాస్ట్ ఛార్జింగ్, 6,500mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
  • 6.74-అంగుళాల 120Hz డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, IP65 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక
  • జూలై 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో సేల్

Vivo T5 Lite 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. ఈసారి టీ సిరీస్ లైనప్‌లో కొత్త వివో T5 లైట్‌ తీసుకొచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ 5జీ కేటగిరీలో లభిస్తుంది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో పాటు ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.

మిలిటరీ-గ్రేడ్, ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, అనేక ఏఐ జనరేటివ్ టూల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ (Vivo T5 Lite 5G) జూలై 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో వివో టీ5 లైట్ ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

వివో T5 లైట్ స్పెసిఫికేషన్లు :
వివో టీ5 లైట్ ఫోన్ 44W 5జీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. కంటిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ప్యానెల్ టీయూవీ రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్ కూడా అందిస్తుంది.

Read Also : Apple iPhone 16 : అద్భుతమైన డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ రాదు!

ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఏఐ క్యాప్షన్స్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, ఏఐ క్రియేషన్, వివో డాక్‌మాస్టర్, గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్ వంటి ఏఐ ఫీచర్లతో వస్తుంది. అదనపు ఫీచర్ల పరంగా చూస్తే.. ఈ ఫోన్ ప్రైవేట్ స్పేస్, వివో ఆఫీస్ కిట్‌ కూడా అందిస్తుంది. ఈ వివో ఫోన్ 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ అందిస్తుంది.

ఫొటోల విషయానికి వస్తే.. :
ఈ ఫోన్ 50ఎంపీ సోనీ IMX852 ప్రైమరీ కెమెరా ఉంది. ఏఐ యూహెచ్‌డీ, ఏఐ కలర్ అడ్జస్ట్‌మెంట్, ఏఐ కటౌట్ వంటి ఏఐ ఆధారిత ఇమేజింగ్ ఫీచర్లు సపోర్టు ఇస్తాయి. 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌ అందిస్తుంది.

భారత మార్కెట్లో వివో T5 లైట్ ధర, కలర్ ఆప్షన్లు :
వివో టి5 లైట్ ఫోన్ 44డబ్ల్యూ 5జి ట్వైలైట్ షాడో వేవ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ధరల వివరాలు :

  • 4జీబీ+ 128జీబీ : రూ. 19,999
  • 6జీబీ + 128జీబీ : రూ. 21,999
  • 6జీబీ + 256జీబీ : రూ. 24,999

ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, అధీకృత రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా అమ్మకానికి రానుంది. లాంచ్-డే ఆఫర్‌గా కొనుగోలుదారులు HDFC బ్యాంక్, SBI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఆఫర్లు జూలై 22న మాత్రమే అందుబాటులో ఉంటాయి.