Vivo T5 Lite 5G Launch : వివో T5 లైట్ 5జీ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo T5 Lite 5G Launch : వివో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ జూలై 16, 2026న భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

Vivo T5 Lite 5G Launch

  • భారత మార్కెట్లో ఈ నెల 16న వివో టీ5 లైట్ 5జీ లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి త్వరలో సేల్ ప్రారంభం కానుంది
  • 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 17,999కే

Vivo T5 Lite 5G Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో T5 లైట్ 5జీ రాబోతుంది. అధికారిక లాంచ్‌కు ముందే వివో ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, సేల్ ఎందులో అనేది కూడా టీజ్ చేసింది. ఈ వివో ఫోన్ 2 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభించనుంది. అందులో ఒకటి మార్బుల్ ఫినిషింగ్‌ టచ్ అందిస్తుంది. రాబోయే ఈ వివో ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో T5 లైట్ ధర, లాంచ్ తేదీ :
వివో టి5 లైట్ ఫోన్ భారత కాలమానం ప్రకారం.. జూలై 16, 2026న మధ్యాహ్నం 12:00 గంటలకు (Vivo T5 Lite 5G Launch) మార్కెట్లో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి త్వరలో అమ్మకానికి రానుంది. ఈ వివో ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్‌లతో సహా 2 కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఇక ఫోన్ ధర విషయానికొస్తే.. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో 4GB ర్యామ్ వేరియంట్ మార్కెట్లో రూ. 17,999కి అందుబాటులో ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి.

Read Also : Samsung Galaxy S26 Ultra : వారెవ్వా మాస్ డీల్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ చాలా చవక.. ఎందుకు కొనాలంటే?

వివో టీ5 లైట్ స్పెసిఫికేషన్లు, కెమెరాలు :
వివో టీ5 లైట్ ఫోన్ 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేతో రావచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉంటాయి. ఈ ఫోన్ 6nm ప్రాసెస్‌పై మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. 4జీబీ LPDDR4X ర్యామ్, 128GB యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆరిజిన్ఓఎస్ 6 ఉంటుంది.

6500mAh బ్యాటరీతో పాటు 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో రావచ్చు. సేఫ్టీ బెనిఫిట్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఉండొచ్చు. ఇందులో ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఏఐ క్యాప్షన్స్, ఏఐ క్రియేషన్, ఏఐ డాక్యుమెంట్స్, ప్రైవేట్ స్పేస్ వంటి కొన్ని ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరాల విషయానికొస్తే.. వివో టీ5 లైట్ 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ సెకండరీ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 5MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉండొచ్చు.