Vivo T5 Series : సూపర్ ఫోన్లు బ్రో.. వివో T5 లైట్ 5G సిరీస్ అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర చాలా చీప్..!

Vivo T5 Series : వివో టి5 ప్రో 5జీ, 1.5K రిజల్యూషన్, 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP సోనీ ఐఎంఎక్స్586 ప్రైమరీ కెమెరా అందిస్తుంది.

Vivo T5 Series

  • వివో టీ5 లైట్ 5జీ ఫోన్లు అదుర్స్
  • ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకే లభ్యం
  • అక్టోబర్ 8 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌

Vivo T5 Series : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్లు.. వివో నుంచి సరికొత్త వివో T5 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. కొత్త ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లతో లైట్ 5G, వివో T5 ప్రో 5G ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టు అయ్యాయి. వివో టి5 లైట్ 5జి 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుండగా, వివో టి5 ప్రో 5G, 6GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ5 లైట్ 5జీ కొత్త 4GB + 64GB వేరియంట్ రూ. 30,999 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలైలో 4GB + 128GB, 6GB + 128GB, 6GB + 256GB వేరియంట్లతో లాంచ్ అయింది.

వివో T5 ప్రో 5జీ ఫోన్ కొత్త 6GB + 128GB వేరియంట్ ధర రూ. 49,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొత్త వేరియంట్లు అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో లభ్యం కానున్నాయి.

Read Also : Vivo V50 Price Drop : ఆఫర్ అదిరింది మావా.. వివో V50 ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..!

వివో T5 లైట్ 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో టీ5 లైట్ 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.74-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0పై రన్ అవుతుంది.

రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 0.8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. వివో T5 లైట్ 5G ఫోన్ 6,500mAh బ్యాటరీ, 44W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది.

వివో T5 ప్రో 5జీ ఫోన్ 1.5K రిజల్యూషన్, 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ ఫ్రంట్ కెమెరాలు, రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. వివో T5 ప్రో 5G ఫోన్ 9,020mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.