Vivo T5 Pro 5G : వివో లవర్స్ కోసం కిర్రాక్ ఫోన్.. 9020mAh బ్యాటరీతో కొత్త వివో T5 ప్రో 5G.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు, ధర జస్ట్..!
Vivo T5 Pro 5G Launch : వివో T5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వివో T4 ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ఉన్నాయి.
- Sreehari A
- Updated on- April 15, 2026 / 05:53 PM IST
Vivo T5 Pro Launched In India
- వివో నుంచి సరికొత్త ప్రో 5జీ ఫోన్ లాంచ్
- 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే
- 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్
Vivo T5 Pro 5G Launch : వివో లవర్స్‌కు భారీ గుడ్ న్యూస్.. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో నుంచి మరో క్రేజీ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈసారి వివో T5 ప్రో 5Gని భారత మార్కెట్లోకి దించింది. టి-సిరీస్ లైనప్ విస్తరణలో భాగంగా మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ కొత్త ప్రో ఫోన్ లాంచ్ చేసింది.
గత ఏడాదిలో వచ్చిన వివో T4 ప్రోకి అప్ గ్రేడ్ వెర్షన్ అనమాట. హార్డ్‌వేర్, బ్యాటరీపరంగా (Vivo T5 Pro) భారీ అప్‌గ్రేడ్‌లతో అందిస్తోంది. భారీ బ్యాటరీ నుంచి హై రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లే వరకు ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ సరికొత్త వివో ప్రో ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో T5 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
చైనాకు చెందిన టెక్ దిగ్గజం వివో టీ5 ప్రోలో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. గరిష్టంగా 5,000 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది.
LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. అధిక వినియోగ సమయంలో టెంపరేచర్ కంట్రోలింగ్ కోసం ఇందులో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో పాటు పలు టెంపరేచర్ సెన్సార్లు ఉన్నాయి.
Read Also : Live Location Sharing : ఎమర్జెన్సీలో మీ లైవ్ లొకేషన్ ఫ్యామిలీతో ఇలా షేర్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
వివో T5 ప్రోలో భారీ 9020mAh బ్యాటరీ ఉంది. 12 గంటల వరకు గేమింగ్, 37 గంటల వీడియో ప్లేబ్యాక్ 90 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని ఈ టెక్ దిగ్గజం పేర్కొంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. ఒరిజిన్ ఐలాండ్ ద్వారా రైటింగ్ అసిస్టెన్స్, లైవ్ క్యాప్షన్స్ స్మార్ట్ నోటిఫికేషన్ల వంటి అనేక ఏఐ (AI) ఫీచర్లను అందిస్తుంది. ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో పాటు, 4K రికార్డింగ్ ఏఐ ఆధారిత అప్ గ్రేడ్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
భారత్‌లో వివో T5 ప్రో ధర, ఆఫర్లు లభ్యత :
వివో T5 ప్రో ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256GB ఆప్షన్ ధర రూ. 33,999 కాగా, టాప్-ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గ్లేసియర్ బ్లూ కాస్మిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రూ. 5వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ వివో ఫోన్ ఏప్రిల్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక స్టోర్ ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్మకానికి వస్తుంది.
