Vivo T5x 5G Sale : కొత్త వివో ఫోన్ కావాలా? వివో T5x 5G ఫస్ట్ సేల్.. భారీ 7,200mAh బ్యాటరీతో మీ బడ్జెట్‌లోనే..

Vivo T5x 5G Sale : వివో టీ5ఎక్స్ 5జీ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. భారీ 7,200mAh బ్యాటరీ, 7400 టర్బో డైమన్షిటీతో అందుబాటులో ఉంది. ఈ వివో ఫోన్ ధర, కీలక ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo T5x 5G Sale

  • వివోనా మజాకా.. వివో T5x 5జీ సేల్ ఆఫర్లు
  • భారీ 7200mAH బ్యాటరీ, డైమన్షిటీ 7400 టర్బో స్పీడ్
  • 6 నెలలు 10 ప్రీమియం ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్

Vivo T5x 5G Sale : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? సరికొత్త పవర్‌హౌస్ వివో T5x 5జీ ఫోన్ ఫస్ట్ సేల్‌ మొదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో స్పీడ్ తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో భారీ 7,200mAh బ్యాటరీతో వస్తుంది.

తక్కువ ధరకే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. IP69 రేటింగ్, ఆకట్టుకునే బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్, వివో స్టోర్లలో అందుబాటులో ఉంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌లలో వివో T5x 5జీ ఫోన్ పవర్‌ఫుల్ ఫీచర్లు, ఆకట్టుకునే డిస్కౌంట్లు, స్పెసిఫికేషన్లతో పొందవచ్చు.

డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు :
వివో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. HDFC, యాక్సిస్, ఎస్బీఐ బ్యాంక్ కార్డుతో చెల్లిస్తే.. రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. యూపీఐ లావాదేవీలపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

Read Also : Free AI Videos : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం టాప్ 5 AI యాప్స్.. ఫ్రీగా వీడియోలు చేయొచ్చు.. లైకులు, కామెంట్లు పక్కా!

రూ. 1,199 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో యూజర్లకు 6 నెలల పాటు 10 ప్రీమియం ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. ఈ ఆఫర్ సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడే వారికి అద్భుతంగా ఉంటుంది.

బ్యాటరీ, స్పీడ్ :
వివో T5x 5జీ ఫోన్ భారీ 7,200mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. రోజంతా గేమింగ్ మల్టీటాస్కింగ్ కోసం ఎక్కువగా సమయం వస్తుంది. ఛార్జర్‌ అవసరం పడదు.
ఛార్జింగ్ కోసం ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్ :
ఈ వివో ఫోన్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. 6.76-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. అద్భుతమైన 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 1200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్‌ క్లియర్‌గా చూడొచ్చు. ఈ ఫోన్ సరికొత్త ఒరిజిన్ఓఎస్ 6 (ఆండ్రాయిడ్ 16)పై రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చాలా స్మార్ట్‌గా అప్‌డేట్‌గా ఉంటుంది. సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

కెమెరా సెటప్ :
ఫొటోగ్రఫీ ప్రియులకు వివో 50MP సోనీ IMX852 ప్రైమరీ సెన్సార్‌ వస్తుంది. 2MP బోకె కెమెరా పోర్ట్రెయిట్ షాట్‌ అందిస్తుంది. సెల్ఫీ ప్రియులకు వీడియో కాలింగ్, రీల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP68, IP69 రేటింగ్‌లతో కూడా వస్తుంది.