Vivo T5x 5G Fusion : వివో క్రేజే వేరబ్బా.. కొత్త వివో T5x 5G ఫ్యూజన్ కిర్రాక్ బ్రో.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర జస్ట్ ఎంతంటే?
Vivo T5x 5G Fusion : వివో T5x 5జీ ఫోన్ 44W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7,200mAh బ్యాటరీతో వచ్చింది. సింగిల్ ఛార్జ్‌పై 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 93 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
- Sreehari A
- Published on- July 28, 2026 / 10:08 PM IST
Vivo T5x 5G Fusion
- మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది
- వివో T5x 5జీ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్ట్
Vivo T5x 5G Fusion : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. వివో నుంచి వివో T5x 5G ఫోన్ భారత మార్కెట్లో కొత్త ఫ్యూజన్ రెడ్ కలర్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చిలో దేశంలో స్టార్ సిల్వర్, సైబర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో రిలీజ్ చేశారు. వివో టి5ఎక్స్ 5జి ఈ కొత్త కలర్ ఆప్షన్, ప్రస్తుత వేరియంట్ స్పెసిఫికేషన్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బోను వాడారు. వివో టి5ఎక్స్ 5జీ బ్యాక్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200mAh బ్యాటరీ 44W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
వివో టి5ఎక్స్ 5జీ ధర ఎంతంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ ధర 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 18,999, 8GB + 128GB వేరియంట్‌కు రూ. 20,999, 8GB + 256GB వేరియంట్‌కు రూ. 22,999గా నిర్ణయించింది. వివో T5x 5జీ ఫోన్ కొత్త కలర్ వేరియంట్లు జూలై 30వ తేదీ నుంచి కంపెనీ ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనేసుకోవచ్చు.
వివో T5ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.76-అంగుళాల ఫుల్ HD ప్లస్ (2,344 x 1,080 పిక్సెల్స్) ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz వరకు, టాప్ బ్రైట్‌నెస్ 1,200 నిట్స్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6పై రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.
కనెక్టివిటీ పరంగా పరిశీలిస్తే.. 5జీ, బ్లూటూత్, Wi-Fi, GPS, BeiDou, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. వివో T5x 5జీ ఫోన్ 7,200mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 93 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 166 x 78.43 x 8.3mm, బరువు సుమారుగా 219 గ్రాములు ఉంటుంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
