Vivo V30 Pro 5G vs Vivo T4 Ultra
Vivo V30 Pro 5G vs Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కొనాలని చూస్తున్నారా? ప్రతి నెలా అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల నుంచి మార్కెట్‌లోకి సరికొత్త మోడళ్లు రిలీజ్ (Vivo V30 Pro 5G vs Vivo T4 Ultra) అవుతున్నాయి. సరైన ఫోన్ ఎంచుకోవడం కొంచెం కష్టమే. వివో ఇటీవల 2 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.
వివో V30 ప్రో 5G, వివో T4 అల్ట్రా ఫోన్ రెండు ఫోన్‌లు పవర్‌ఫుల్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ కలిగి ఉన్నాయి. కానీ, ఈ రెండు ఫోన్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వివో V30 ప్రో, వివో T4 అల్ట్రా ఫోన్ల మధ్య తేడాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
డిజైన్, డిస్‌ప్లే :
వివో V30 ప్రో 5Gలో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ కలిగి ఉంది. బ్రైట్‌నెస్ 2800 నిట్స్ వరకు పెరుగుతుంది. తద్వారా స్క్రీన్ సూర్యకాంతిలో సులభంగా చూడవచ్చు. వివో T4 అల్ట్రా కొంచెం చిన్నది కానీ, అద్భుతమైన డిస్‌ప్లేను అందిస్తుంది. 6.67-అంగుళాల కర్వడ్ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. మీరు అవుట్‌డోర్‌లలో ఎక్కువగా వాడితే వివో T4 అల్ట్రా డిస్‌ప్లేతో వస్తుంది.
వివో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వివో V30 ప్రో 5Gలో మీడియాటెక్ డైమన్షిటీ 8200 చిప్‌సెట్ ఉంది. అయితే, వివో T4 అల్ట్రాలో లేటెస్ట్ డైమన్షిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ కలిగి ఉంది. వివో T4 అల్ట్రా బెంచ్‌మార్క్ స్కోర్‌లలో దాదాపు రెండింతలు ఉంటుంది. ఈ 2 వివో ఫోన్‌లు 8GB/12GB ర్యామ్, 256GB/512GB స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తాయి. కానీ, వివో T4 అల్ట్రా ఆండ్రాయిడ్ 15 మరిన్ని అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది.
కెమెరా క్వాలిటీ :
వివో V30 ప్రో 5G ఫోన్ హైలైట్ కెమెరా కలిగి ఉంది. భారీ ఆప్టిక్స్‌తో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ పొందవచ్చు. ఇందులో వైడ్, టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లు ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కూడా ఉంది. వివో T4 అల్ట్రా కెమెరా సెటప్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
50MP మెయిన్ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (100x జూమ్‌తో) 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32MP కలిగి ఉంది. వివో V30 ప్రో 5G ఫొటోలో మెరుగ్గా ఉంటుంది. వివో T4 అల్ట్రా జూమ్, మల్టీఫేస్ ఫొటోగ్రఫీని అందిస్తుంది.
వివో V30 ప్రో 5Gలో 5000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ ఫోన్ దాదాపు 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. మరోవైపు, వివో T4 అల్ట్రా ఫోన్ భారీ 5500mAh బ్యాటరీ ప్యాక్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. వివో T4 అల్ట్రా బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ స్పీడ్ రెండింటిలోనూ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు.
వివో V30 ప్రో 5G ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, NFC వంటి ఫీచర్లను కలిగి ఉంది. వివో T4 అల్ట్రా IP64 రేటింగ్, Wi-Fi 7, స్టీరియో స్పీకర్లు, అనేక AI ఆధారిత ఫీచర్లు (ఏఐ ఎరేజర్, కాల్ ట్రాన్స్‌లేషన్) కలిగి ఉంది.
కెమెరా క్వాలిటీ, స్టైలిష్ డిజైన్, Zeiss ఆప్టిక్స్ ఎక్స్‌పీరియన్స్ కోసం వివో V30 ప్రో 5G అద్భుతమైన ఆప్షన్. పవర్‌ఫుల్ ప్రాసెసర్, సూపర్ బ్రైట్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ, అడ్వాన్స్ ఫీచర్ల కోసం వివో T4 అల్ట్రా బెస్ట్ ఆప్షన్ పొందవచ్చు.