Vivo V60 Phone : కొత్త వివో ఫోన్ కావాలా? ఖతర్నాక్ ఫీచర్లతో వివో V60 వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Vivo V60 Launch : వివో నుంచి అతి త్వరలో వివో V60 ఫోన్ వచ్చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఆగస్టు 19న ఈ కొత్త వివో ఫోన్ లాంచ్ కానుంది..

Vivo V60 Phone : కొత్త వివో ఫోన్ కావాలా? ఖతర్నాక్ ఫీచర్లతో వివో V60 వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Vivo V60 Launch Date

Updated On : July 16, 2025 / 8:14 PM IST

Vivo V60 Launch : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. వివో X200 FE స్మార్ట్‌ఫోన్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు మరో (Vivo V60 Launch) స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.

వచ్చే నెలలో వివో V60 లాంచ్ కానుందని లీక్ డేటా పేర్కొంది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లను కూడా కంపెనీ ఆవిష్కరించనుంది. నివేదికల ప్రకారం.. వివో OriginOS కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వివో V60 ఫోన్ ఇంకా ఏయే ఫీచర్లతో రానుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వివో V60 లాంచ్ ఎప్పుడంటే? :
ఆగస్టు 19న భారత మార్కెట్లో వివో V60 లాంచ్ కానుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టిప్‌స్టర్ విషయానికొస్తే.. వివో V60 ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించిన OriginOSతో కూడా రావొచ్చు. ఫన్‌టచ్ OS ప్లాట్‌ఫామ్‌తో OriginOS వంటి ఆపరేటింగ్ సిస్టమ్ అందించే అవకాశం ఉందని పుకారు ఉంది.

Read Also : EPF Alert : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ చిన్న పొరపాటు చేస్తే.. మీ సర్వీస్‌ కోల్పోతారు జాగ్రత్త.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

ఈఈసీ EEC (యూరప్), మలేషియా (SIRIM), TUV వంటి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లు రాబోయే వివో V60 మోడల్ నంబర్ V2511 ప్రవేశపెట్టనుందని ఓ నివేదిక తెలిపింది. TUV లిస్టింగ్ విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంది.

వివో V60 ఫీచర్లు (అంచనా) :
వివో V60 అనేది చైనా వెర్షన్ మోడిఫైడ్ వివో S30 కావచ్చునని నివేదికలు చెబుతున్నాయి. వివో S30 6.67-అంగుళాల OLED ప్యానెల్ 120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 16GB వరకు LPDDR4x ర్యామ్, 512GB UFS 2.2 స్టోరేజ్ ఫోన్ చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వివో S30 ఫోన్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, OIS సామర్థ్యంతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం ఆటోఫోకస్‌కు సపోర్టు ఇస్తుంది.