EPF Alert : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ చిన్న పొరపాటు చేస్తే.. మీ సర్వీస్‌ కోల్పోతారు జాగ్రత్త.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

EPF Alert : ఈపీఎఫ్ విషయంలో చేసే చిన్న పొరపాటుతో కూడా భారీగా నష్టపోవాల్సి వస్తుంది.. కొన్నిసార్లు 15ఏళ్ల సర్వీసు కూడా కోల్పోవచ్చు..

EPF Alert : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ చిన్న పొరపాటు చేస్తే.. మీ సర్వీస్‌ కోల్పోతారు జాగ్రత్త.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

EPF

Updated On : July 16, 2025 / 7:30 PM IST

EPF Alert : మీ పీఎఫ్ అకౌంట్ సరిగా ఉందా? అన్ని వివరాలు సరిగా ఉన్నాయా? ఓసారి చెక్ చేయండి.. లేదంటే చాలా నష్టపోతారు. సాధారణంగా, ప్రైవేట్ రంగంలో (EPF Alert)  పనిచేసే ఉద్యోగులు తరచుగా జాబ్స్ మారుతుంటారు. ఒక కంపెనీని వదిలి మరొక కంపెనీలో చేరతారు.

ఇలాంటి సందర్భాల్లో EPF అకౌంటుపై నేరుగా ప్రభావం పడుతుంది. తమ EPF డబ్బును పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. దీనికి ఒక ప్రాసెస్ కూడా ఉంది. కంపెనీ PF ట్రస్ట్ ద్వారా EPF డబ్బును ప్రాసెస్ చేసినప్పుడు సమస్య వస్తుంది. చాలా పెద్ద కంపెనీలు ఇలా చేస్తాయి. పెన్షన్ భాగాన్ని (EPS) ఈపీఎఫ్ఓకు పంపుతారు.

జాయినింగ్ తేదీలో పొరపాటు కూడా సమస్యే :
కంపెనీ పొరపాటున ఉద్యోగి అసలు జాయినింగ్ తేదీని అప్‌లోడ్ చేయలేదంటే.. ఈపీఎఫ్ఓ సిస్టమ్ PF ట్రాన్స్‌ఫర్ తేదీని జాయినింగ్ తేదీగా తీసుకుంది. ఫలితంగా, ఉద్యోగి 15 ఏళ్ల సర్వీస్ రికార్డును కోల్పోతాడు. ఈ చిన్న తప్పు వల్ల చాలా సమస్యలు వస్తాయి.

ఉద్యోగి తన పెన్షన్ ప్రయోజనాలను కూడా కోల్పోతాడు. PF ట్రాన్స్‌ఫర్, విత్‌డ్రా క్లెయిమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కనీసం 10 ఏళ్ల సర్వీస్ అవసరం. ఇకపై EPS పెన్షన్‌కు అర్హులు కాడు. ఇలాంటి తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పీఎఫ్ బదిలీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఉద్యోగికి సర్వీసు అనేది వారు ఎంతకాలంగా ఉద్యోగం చేస్తున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో మొదటగా చేరిన దగ్గరి నుంచి వారి సర్వీసు ప్రారంభమవుతుంది.

Read Also : Post Office Schemes : మహిళల కోసం సూపర్ స్కీమ్స్.. పోస్టాఫీసులో ఏయే పథకాల్లో పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుందంటే? ఫుల్ డిటెయిల్స్..!

పుట్టిన తేదీ తప్పుగా ఉందా? :
మీ పుట్టిన తేదీ తప్పుగా ఉంటే.. అనేక ఇబ్బందులకు దారితీయొచ్చు. పెన్షన్ ప్రయోజనం ఆగిపోవచ్చు. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ లేదా విత్‌డ్రా అభ్యర్థన రిజక్ట్ అవుతుంది. అందుకే మీ పుట్టిన తేదీ సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. అది తప్పుగా ఉంటే.. వెంటనే సరిదిద్దుకోవాలి.

ఈపీఎఫ్‌లో రాంగ్ డేటాను ఎలా ఎడిట్ చేయాలి? :
ఈపీఎఫ్ఓ ఇప్పుడు పుట్టిన తేదీని ఎడిట్ చేసే అవకాశం అందిస్తోంది. ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో తమ అన్ని వివరాలను చెక్ చేయాలి. ఏదైనా వివరాలు తప్పుగా ఉంటే.. వీలైనంత త్వరగా ఎడిట్ చేయాలి.

పుట్టిన తేదీ లేదా జాయినింగ్ డేట్ వంటి వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉంటే.. అది క్లెయిమ్ సమయంలో పెద్ద సమస్యకు దారితీస్తుంది. మీ ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను చెక్ చేయాలి. మీ పుట్టిన తేదీ, పెన్షన్ స్టేటస్, ప్రతి నెలా ఎంత డబ్బు జమ అవుతుందో కూడా చెక్ చేయాలి.