Vivo V60e Launch
Vivo V60e Launch : కొత్త వివో ఫోన్ వచ్చేసింది. వివో లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్.. గత ఆగస్టులో వివో V60 లాంచ్ కాగా సరిగ్గా 3 నెలల తర్వాత చైనీస్ టెక్ దిగ్గజం వివో ‘V’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్ తీసుకొచ్చింది. అదే.. వివో V60e ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ బ్యాటరీ, భారీ డిజైన్, కూల్ కెమెరా ఫీచర్లు కలిగి ఉందని టెక్ దిగ్గజం పేర్కొంది.
ఈ కొత్త ఫోన్ అద్భుతమైన కెమెరాలతో (Vivo V60e Launch) మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో బ్యాటరీని అందిస్తుంది. వివో V60e ఫోన్ ఫీచర్లు, ఇతర స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
వివో V60e స్పెసిఫికేషన్లు :
వివో V60e ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద వివో V60e ఫోన్ 4nm ప్రాసెస్‌పై మీడియాటెక్ డైమన్షిటీ 7360 టర్బో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్OS 15పై నేరుగా బాక్స్ నుంచి రన్ అవుతుంది.
వివో V60e కెమెరా, డిజైన్ :
ఈ కొత్త ఫోన్‌లో వివో V సిరీస్ చరిత్రలోనే తొలిసారిగా OISతో కూడిన 200MP ప్రైమరీ కెమెరా ఉంది. అదనంగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఐ ఆటో ఫోకస్‌తో 50MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంది. వివో V60e ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంది. నీటి, ధూళి నిరోధకతకు IP68/IP69 రేట్ అయింది. డిజైన్ ఫ్రంట్ సైడ్ వివో V60e ఫోన్ ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ ఫోన్ 7.55mm మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
భారత్‌లో వివో V60 ధర ఎంతంటే? :
అక్టోబర్ 10 నుంచి వివో ఇండియా ఆన్‌లైన్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా వివో V60e ఫోన్ అందుబాటులో ఉంటుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.29,999, 8GB + 256GB మోడల్ ధర రూ.31,999, 12GB + 256GB ప్రీమియం వేరియంట్ ధర రూ.33,999కు పొందవచ్చు.