Vivo V60e Price : వివో ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త వివో V60e ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..

Vivo V60e Price : వివో V60 లాంచ్ తర్వాత భారతీయ యూజర్ల కోసం వివో V60e లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Vivo V60e Price

Vivo V60e Price : వివో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వివో ఇండియా సరికొత్త వివో ఫోన్ తీసుకురాబోతుంది. నెలక్రితమే వివో V60 ఫోన్ ఆవిష్కరించగా మరో V60e వేరియంట్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. చైనీస్ టెక్ దిగ్గజం ఇప్పటికే ఈ సిరీస్‌లో రాబోయే మోడల్ వివో V60e ఫోన్‌కు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి.

ముందస్తు లీక్‌ల ప్రకారం.. ఈ కొత్త మోడల్ వివో V60 కన్నా కొంచెం (Vivo V60e Price) తక్కువ ధరకు లభించనుంది. ఇంకా సరసమైన ధరకు పొందాలంటే కొంచెం టోన్-డౌన్ ప్యాకేజీని కూడా అందిస్తుంది. డిజైన్, కలర్ ఆప్షన్లలో స్పెసిఫికేషన్లు, ధరలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

వివో V60e డిజైన్, కలర్ ఆప్షన్లు :
నివేదికల ప్రకారం.. వివో V60e, వివో V60 ఫోన్ మోడల్‌కు దగ్గరగా ఉంటుంది. బ్యాక్ సైడ్ సిగ్నేచర్ రింగ్-ఆకారపు ఫ్లాష్‌తో వస్తుంది. వివో V60 లైనప్‌లో కలర్ ఆప్షన్ల పరంగా స్మార్ట్‌ఫోన్ నోబుల్ గోల్డ్, ఎలైట్ పర్పుల్ 2 కలర్ ఆప్షన్లలో రావొచ్చు.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఒప్పో రెనో 14 సిరీస్, ఒప్పో K13 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..

వివో V60e స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ లీక్‌ల ప్రకారం.. వివో V60e ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. టాప్ మిడ్ రేంజ్ కేటగిరీలో ఉంటుందని సూచిస్తున్నాయి. బ్యాక్ సైడ్ ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌ కలిగి ఉండవచ్చు. అయితే, సెన్సార్ల వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేట్‌తో రానుంది. డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని అంచనా. బ్యాటరీ పరంగా వివో V60 మాదిరిగానే 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. భారీ 6,500mAh బ్యాటరీ యూనిట్‌ కూడా ఉండొచ్చు.

భారత్‌లో వివో V60e ధర, లాంచ్ తేదీ (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో బేస్ వివో V60e మోడల్ ధర రూ.29,999 నుంచి ఉండొచ్చు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో టాప్-ఎండ్ మోడల్ ధర రూ.32,999 ఉండొచ్చు. అయితే, 8GB ర్యామ్ 256GB మోడల్ ధర రూ.31,999 కావచ్చు. వివో ఈ ఫోన్ల లాంచ్‌ను అధికారికంగా ధృవీకరించలేదు. వచ్చే నెల ప్రారంభంలోనే ఈ వివో V60e ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.