×
Ad

Vivo V70 Launch : కొత్త వివో V70 5G ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V70 Launch : వివో V70 5G ఫోన్ లాంచ్ కాబోతుంది. భారత మార్కెట్లో అతి త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫీచర్లు, ధర వివరాలు ముందే లీక్ అయ్యాయి.

1/5
Vivo V70 Launch : వివో లవర్స్ మీకోసమే.. అతి త్వరలో కంపెనీ నుంచి కొత్త వివో ఫోన్ రాబోతుంది. అదిరిపోయే ఫీచర్లతో వివో V60 5జీ ఫోన్ లాంచ్ కానుంది. వివో V70 ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) సర్టిఫికేషన్ పొందుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ త్వరలో లాంచ్ కావచ్చని అంచనా.
2/5
అంతేకాదు, వివో V70 ఫోన్ కొన్ని కీలక ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో రివీల్ అయ్యాయి. ఈ వివో ఫోన్ 5G, బ్లూటూత్, NFC, Wi-Fi 6 సపోర్టు ఇస్తుంది. వివో V70 ఫోన్ ధర, రేంజ్, స్పెసిఫికేషన్లు, లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
3/5
వివో V70 5G స్పెసిఫికేషన్లు (అంచనా) : వివో V70 ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంటుంది. వివో V60 ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ కలిగి ఉండవచ్చు. FCC సర్టిఫికేషన్‌లో గుర్తించినట్లుగా ఈ వివో ఫోన్ 12GB ర్యామ్, 512GB స్టోరేజీని పొందవచ్చు. 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh లేదా 7,000mAh బ్యాటరీ సపోర్టు ఇవ్వవచ్చు. ఆండ్రాయిడ్ 16తో రానుంది.
4/5
కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను పొందే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరాలన్నీ Zeiss-ట్యూన్ అవుతాయి.
5/5
వివో V70 5G ధర (అంచనా) : వివో V60 ఫోన్ లాంచ్ తర్వాత ఫిబ్రవరి 2026లో వివో V70 లాంచ్ అవుతుందని అంచనా. అయితే, కచ్చితమైన తేదీ ఇంకా రివీల్ చేయలేదు. ఇంకా ధరల విషయానికి వస్తే.. వివో V70 5G బేస్ వేరియంట్ ధర దాదాపు రూ. 36,999 కావచ్చు. వివో V60 మెమరీ హార్డ్‌వేర్ కాంపోనెంట్ ధరలు ప్రత్యేకంగా మారవచ్చు.