Vivo V70 Series : వివో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. భారీగా పెరిగిన వివో ఫోన్ల ధరలు.. కొత్త రేట్లు ఇవే
Vivo V70 Series : వివో వి70 సిరీస్ ధరలు భారీగా పెరిగాయి. ప్రారంభంలో రూ. 56,999కి లభించిన వివో వి70 (12GB+256GB) వేరియంట్ ధర ఇప్పుడు రూ. 64,999కి చేరింది.
- Sreehari A
- Published on- August 1, 2026 / 04:51 PM IST
Vivo V70 Series
- వివో V70 ధర రూ. 8వేల వరకు పెరిగింది.
- స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మొబైల్ ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి
- ఏ మోడల్ ధర ఎంతవరకు పెరిగిందో ఇప్పుడు తెలుసా?
Vivo V70 Series : వివో లవర్స్ కు బిగ్ షాకింగ్ న్యూస్.. కంపెనీ మేకర్ వివో V70 ధరలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో లభించే ఈ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీరు రూ. 8వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాదు.. ఈ సిరీస్‌లో వివో V70, వివో V70 ఎలైట్, వివో V70 ఎఫ్ఈ వంటి కొత్త మోడళ్లు ఉన్నాయి. వివిధ ర్యామ్ స్టోరేజ్ (Vivo V70 Series) వేరియంట్లలో కూడా పొందవచ్చు. ఈ ఫోన్ 5జీబీ నుంచి 12జీబీ వరకు ర్యామ్ ఆప్షన్లను అందిస్తుంది. 512జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి వేరియంట్ ధర ఎంత పెరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత మార్కెట్లో వివో వి70 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధర రూ.8వేల వరకు పెరిగింది. వివో వి70 ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర గతంలో రూ.53,999గా ఉండేది. కానీ, ఇప్పుడు ధర రూ.59,999కి పెరిగింది. అదేవిధంగా, వివో వి70 ఫోన్ 12GB+256GB వేరియంట్ ధర రూ.56,999 నుంచి రూ.64,999కి పెరిగింది.
Read Also : Redmi K100 Pro Series : రెడ్‌మి కొత్త ప్రో ఫోన్లు రాబోతున్నాయి.. ఈసారి రేంజ్ మామూలుగా ఉండదు బ్రో!
వివో V70 ఎలైట్ ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర గతంలో రూ.58,999గా ఉండేది. కానీ, ఇప్పుడు ధర రూ.66,999కి పెరిగింది. వివో V70 ఎలైట్ 12GB+256GB వేరియంట్ ధర గతంలో రూ.63,999గా ఉండేది. ఇప్పుడు ఈ వివో ఫోన్ ధర రూ.71,999కి పెరిగింది.
వివో V70FE ఫీచర్లు, స్పెషిషికేషన్లు :
వివో వి70 ఎఫ్ఈ ఫోన్ నుంచి 8GB+128GB వేరియంట్ ధర రూ. 41,999 నుంచి ఇప్పుడు రూ. 44,999కి పెరిగింది. అంటే.. ధర రూ. 3వేలు పెరిగింది. ఈ ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ. 45,999 నుంచి రూ. 49,999కి పెరిగింది. ఈ ఫోన్ 12GB+256GB వేరియంట్ ధర రూ. 46,999 నుంచి ఇప్పుడు రూ. 51,999కి పెరిగింది.
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మొబైల్ ధరలను కూడా భారీగా పెంచుతున్నాయి. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోలుపై వినియోగదారులు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
డీఆర్ఏఎమ్ సంక్షోభం మరింత తీవ్రతరం కానుందని శాంసంగ్ ఇటీవలే సూచించింది. 2027లో ర్యామ్ మెమరీ చిప్‌లకు డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేయగా, మెమరీ చిప్‌ల సరఫరా పరిమితంగా ఉండటంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ సరఫరా కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి.
