Vivo X Fold 6 : మడతలో మ్యాజిక్.. బ్యాటరీలో బీస్ట్.. వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది!
Vivo X Fold 6 : వివో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. 7000mAh బ్లూ ఓసియన్ బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
- Sreehari A
- Published on- June 19, 2026 / 02:12 PM IST
Vivo X Fold 6 : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 8.02-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్ ఉంటుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 6లో ఎఫ్/1.68 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉంటుంది.
Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. అతి త్వరలో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 6 కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ ముందుగానే వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ ప్రాసెసర్ కూడా అందిస్తుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 5కు అప్ గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది.
రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh 'బ్లూ ఓషన్' బ్యాటరీ ఉండొచ్చని అంచనా. వివో ఎక్స్ ఫోల్డ్ 5లో 6,000mAh బ్యాటరీ ఉంది. హై లోడ్ పరిస్థితులలో రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సుమారుగా 9.8 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ -20 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా వర్క్ అవుతుంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 6 లైట్ హింజ్ ఆప్షన్ అందిస్తుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ జూన్ 26న చైనాలో లాంచ్ కానుంది. ప్రీ-రిజర్వేషన్లు ఇప్పటికే మొదలయ్యాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 6 కొత్త 'బ్లూ హోల్' కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కలర్ బ్లూ కలర్ సింక్‌హోల్స్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పోలార్ నైట్, సాల్ట్ లేక్, బ్లాక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ రౌండెడ్ కార్నర్స్ వర్టికల్ ఎడ్జ్ లతో మెటల్ ఫ్రేమ్ అందిస్తుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 6, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్ సాధారణ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 కన్నా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.
5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్, 8.02-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్ ఉంటుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 6లో ఎఫ్/1.68 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను అటామిక్ వర్క్‌బెంచ్‌తో అందించనుంది. సింగిల్ స్క్రీన్‌పై అనేక యాప్‌లను ఓపెన్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6 ఫోల్డ్‌పై రన్ అవుతుంది. ఇందులో కొన్ని ఏఐ సంబంధిత టూల్స్ కూడా ఉండొచ్చు.
