Vivo X Fold 6 Launch : వివో X ఫోల్డ్ 6 మడతబెట్టే ఫోన్ వచ్చేసిందోచ్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.. ధర ఎంతైనా కొనేస్తారు తెలుసా?
Vivo X Fold 6 Launch : వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్ 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందిస్తుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- June 27, 2026 / 02:54 PM IST
Vivo X Fold 6 Launch
- మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది
- వివో ఎక్స్ ఫోల్డ్ 6 బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా
- ఈ స్మార్ట్‌ఫోన్ 8K వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు
Vivo X Fold 6 Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో లవర్స్ కోసం సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్ 6లో 8.02-అంగుళాల శాంసంగ్ M14 ఇన్నర్ ఫోల్డబుల్ అమోల్డ్ స్క్రీన్ 6.51-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫోన్ బుక్ షేప్ మాదిరిగా మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో ఎక్స్ ఫోల్డ్ 6 ధర ఎంతంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7,999 (సుమారుగా రూ. 1,11,000), 12GB + 512GB వేరియంట్ (Vivo X Fold 6 Launch) ధర CNY 8,999 (సుమారుగా రూ. 1,25,000), 16GB + 512GB వేరియంట్ ధర CNY 9,999 (సుమారుగా రూ. 1,38,700), 16GB + 1TB వేరియంట్ ధర CNY 10,999 (సుమారుగా రూ. 1,52,600) ఉంటుంది. వివో ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ గోల్డ్ ఎడిషన్‌ను కూడా CNY 10,999 (సుమారుగా రూ. 1,56,800) ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సాల్ట్ లేక్, బ్లూ హోల్ పోలార్ నైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : Redmi 17C : సూపర్ ఫోన్ బ్రో.. 5,160mAh బ్యాటరీతో కొత్త రెడ్‌మి 17C ఫోన్.. ధర చాలా తక్కువ..!
వివో Xఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ డ్యూయల్ సిమ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4K కంటెంట్ సపోర్ట్‌తో 8.02-అంగుళాల (2,504 x 2,312 పిక్సెల్స్) లోపలి ఫోల్డబుల్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. బయటి డిస్‌ప్లేలో 6.51-అంగుళాల (1,120 x 2,528 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్ ఉంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు డిస్‌ప్లేలలో 20MP కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8K వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు.
కనెక్టివిటీ విషయానికి వస్తే..
4జీ, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, BeiDou, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెన్సార్లుగా గైరోస్కోప్, ఇ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్ గ్రావిటీ సెన్సార్ ఉన్నాయి.
వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్ 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 157.16 x 145.66 x 4.40mm ఫోల్డ్ చేస్తే స్క్రీన్ 157.16 x 74.26 x 9.40mm ఉంటుంది. ఈ డివైజ్ బరువు సుమారుగా 228 గ్రాములు ఉంటుంది.
