Vivo X100, X100 Pro India launch date confirmed
Vivo X100 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో ఎట్టకేలకు వివో ఎక్స్100 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఎక్స్100, అలాగే వివో ఎక్స్100 ప్రో మోడల్ జనవరి 4న భారత మార్కెట్లో రిలీజ్ చేయనుంది. ఈ వివో ఎక్స్ సిరీస్ ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి.
ఈ రెండింటి డివైజ్ స్పెసిఫికేషన్‌లు వివరాలు కూడా రివీల్ అయ్యాయి. వివో ఎక్స్100 సిరీస్‌లో మునుపటి అన్ని ఎక్స్ సిరీస్ డివైజ్‌ల మాదిరిగానే కెమెరా-ఫోకస్డ్ ఫోన్‌లు ఉంటాయి. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో డైమెన్సిటీ 9300, శక్తివంతమైన కెమెరా సెటప్‌తో వస్తాయి.
వివో ఎక్స్100 సిరీస్ స్పెషిఫికేషన్లు ఇవే :
వివో ఎక్స్100 ప్రో, వివో ఎక్స్100 రెండూ ఒకే విధమైన శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను కలిగి ఉంటాయి. అధునాతన డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. వేగవంతమైన పనితీరును అందిస్తాయి. ఈ ఫోన్‌లు 8టీ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను ఉపయోగించే పెద్ద 6.78-అంగుళాల స్క్రీన్‌తో వస్తాయి. 1260పీ రిజల్యూషన్‌లో ఆకర్షణీయమైన విజువల్స్‌ను అందిస్తాయి.
ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను తక్కువ 1హెచ్‌జెడ్ నుంచి మృదువైన 120హెచ్‌జెడ్‌కి సర్దుబాటు చేయగలదు. తద్వారా గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దీని ప్రదర్శన 3,000 నిట్‌ల వరకు ప్రకాశవంతంగా ఉంటుంది. 2,160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందిస్తుంది. ఇది మీ కళ్లను రక్షించడంలో సాయపడుతుంది.
అద్భుతమైన కెమెరా-ఫోకస్డ్ ఫీచర్లు :
రెండూ స్క్రీన్‌లో ఇంటర్నల్ ఫింగర్‌ప్రింట్ రీడర్‌లను కలిగి ఉన్నాయి. డిస్‌ప్లేపై చిన్న హోల్ ఉంచిన 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లు దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేట్ అయ్యాయి. ఆండ్రాయిడ్ 14ను వివో ఫన్‌టచ్ ఓఎస్ 14 ఇంటర్‌ఫేస్‌తో ఉపయోగిస్తున్నారు. స్టార్‌ట్రైల్ బ్లూ, ఆస్టరాయిడ్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో వస్తాయి.
Vivo X100, X100 Pro India launch
వివో ఎక్స్100 ప్రో అసాధారణమైన కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. 50ఎంపీ ప్రధాన కెమెరా, ప్రత్యేక పెరిస్కోప్ జూమ్ కెమెరాను కలిగి ఉంది. ఈ జూమ్ కెమెరాలో 50ఎంపీ సెన్సార్ ముందు 100ఎమ్ఎమ్ లెన్స్ ఉంది. ఇది ప్రత్యేకమైనది. జీసెస్ ఏపీఓ ధృవీకరణను పొందింది. అదనంగా, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. మెరుగైన ఫొటోగ్రఫీకి వివో లేటెస్ట్ 6ఎన్ఎమ్ వి3 ఇమేజింగ్ చిప్‌ని ఉపయోగిస్తుంది.
రెండు స్టోరేజీ ఆప్షన్లతో ఎక్స్100 సిరీస్ :
మరోవైపు, వివో ఎక్స్100 పెద్ద 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 120డబ్ల్యూ వరకు వేగంగా ఛార్జింగ్ చేసేందుకు సపోర్టు ఇస్తుంది. దీని కెమెరా సిస్టమ్‌లో 50ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్, 64ఎంపీ సెన్సార్‌తో 70ఎమ్ఎమ్ జూమ్ లెన్స్, వివో ఎక్స్100 ప్రో మాదిరిగా అదే 15ఎమ్ఎమ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అయితే, పాత వి2 ఇమేజింగ్ చిప్‌ని ఉపయోగిస్తుంది. వివో ఎక్స్100 రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది.
అందులో 12జీబీ ర్యామ్‌తో 256జీబీ స్టోరేజ్ ఆప్షన్, 16జీబీ ర్యామ్‌తో 512జీబీ స్టోరేజ్ ఆప్షన్, వివో ఎక్స్100 ప్రో మోడల్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో వస్తుంది. ఈ మోడళ్ల ధర వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి. చైనా ధరల అంచనా ప్రకారం.. వివో ఎక్స్100 సిరీస్ రూ. 57,090 వరకు ఉండవచ్చు. వివో ఎక్స్100 సిరీస్ అధునాతన ఫీచర్‌లు, అద్భుతమైన కెమెరాలతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి.
Read Also : Whatsapp Status Trick : ఇతరుల వాట్సాప్ స్టేటస్‌ను సీక్రెట్‌గా ఇలా చూడొచ్చు తెలుసా?