Vivo X300 Pro Sale : కొంటే వివో ఫోన్ కొనాలి.. ఈ వివో X300 ప్రోపై రూ. 10వేలకు పైగా తగ్గింపు.. ఎలాగంటే?
Vivo X300 Pro Sale : వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు ముందుగానే వివో ఎక్స్300 ప్రో ఫోన్ ఏకంగా రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
- Sreehari A
- Published on- September 29, 2026 / 07:04 PM IST
Vivo X300 Pro Sale
- అక్టోబర్ 8 నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026
- ఈ సేల్‌లో అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు
- ప్రస్తుతం అమెజాన్‌లో వివో X300 ప్రో రూ. 10వేలకుపైగా తగ్గింపు
Vivo X300 Pro Sale : కొత్త వివో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అతి త్వరలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ అక్టోబర్ 8 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ వంటి మరిన్ని కేటగిరీలతో సహా వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఫొటోగ్రఫీ కోసం ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ తీసుకోవాలని చూస్తుంటే.. వివో X300 ప్రో ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 10వేలకుపైగా డిస్కౌంట్‌తో లభిస్తోంది. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి..
వివో X300 ప్రో డీల్ :
వివో ఎక్స్300 ప్రో అధికారిక ధర రూ. 1,19,999గా ఉంది. అమెజాన్‌లో ఈ వివో ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ. 10,050 తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు.
వివో X300 ప్రో స్పెసిఫికేషన్లు :
వివో X300 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,510mAh బ్యాటరీ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్‌లో 2800 × 1260 (1.5K+) రిజల్యూషన్ 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ HDR10 ప్లస్, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ హెచ్‌డీఆర్, ఎస్‌జీఎస్ లో-బ్లూ లైట్ టీయూవీ రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీకి కూడా సపోర్ట్ చేస్తుంది.
ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. వివో ఎక్స్300 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP సోనీ LYT-828 ప్రైమరీ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ JN1 లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్, OIS, ఎఫ్/2.67 అపర్చర్‌తో 200MP HPB టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా కూడా ఉంది.
