Vivo X300 Ultra Review : DSLR రేంజ్ ఫోన్ వచ్చేసింది.. వివో X300 అల్ట్రా 200MP కెమెరాతో సంచలనం.. 6600mAh బ్యాటరీతో మాస్ ఎంట్రీ!
Vivo X300 Ultra Review : వివో X300 అల్ట్రా భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 6600mAh బ్యాటరీ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- May 6, 2026 / 08:01 PM IST
Vivo X300 Ultra Review
- వివో X300 అల్ట్రాలో 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- 6600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 17.4x ఆప్టికల్ జూమ్‌తో టెలికన్వర్టర్ యాక్సెసరీకి సపోర్టు
Vivo X300 Ultra Review : వివో ఫ్యాన్స్ కోసం సరికొత్త అల్ట్రా మోడల్ వచ్చేసింది. భారత మార్కెట్లో వివో ఎక్స్300 అల్ట్రా లాంచ్ అయింది. ఈ కెమెరా-సెంట్రలైజడ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇప్పటికే ఉన్న వివో ఎక్స్300 కన్నా లైట్ వెర్షన్ వివో ఎక్స్300 FEని కూడా కంపెనీ లాంచ్ చేసింది. వివో ఎక్స్300 అల్ట్రా మార్చి చివరిలో చైనాలో లాంచ్ కాగా దాదాపు అవే స్పెసిఫికేషన్లతో భారత మార్కెట్లోకి కూడా వచ్చింది.
ఈ కొత్త ఫ్లాగ్‌షిప్‌లో 6.82-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 512జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్, 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇందులో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే భారీ 6600mAh బ్యాటరీ కూడా ఉంది.
ధర విషయానికి వస్తే.. :
భారత మార్కెట్లో వివో ఎక్స్300 అల్ట్రా 16GB + 512GB వేరియంట్ ధర రూ. 1,59,999గా ఉంది. ఈ ఫోన్ విక్టరీ గ్రీన్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మే 14న వివో అధికారిక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర పార్టనర్ రిటైలర్ల ద్వారా సేల్స్ ప్రారంభం కానున్నాయి.
వివో ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు లెన్స్, గ్రిప్ కిట్ కూడా ప్రవేశపెడుతుంది. విడిగా కొనాల్సి ఉంటుంది. వివో జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ జెన్ 2 అల్ట్రా 400mm ధర రూ. 27,999 కాగా, గ్రిప్ కిట్ ధర రూ. 11,999గా ఉంది.
వివో ఎక్స్300 అల్ట్రాతో పాటు టెలిఫోటో ఎక్స్‌టెండర్ (400mm), గ్రిప్ కిట్ కాంబోను కొనుగోలు చేస్తే.. రూ. 4వేలు తగ్గింపు లభిస్తుంది. కాంబో ధర రూ. 1,95,997 అవుతుందని కంపెనీ చెబుతోంది. అయితే, 200mm ఎక్స్‌టెండర్ కలిపి కాంబో మొత్తం ధర రూ. 2,09,999 అవుతుంది.
ఆఫర్ల విషయానికొస్తే.. :
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో 10శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్ నెలకు రూ. 6,667 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లతో 24 నెలల వరకు అందుబాటులో ఉంది. కస్టమర్‌లకు ఫ్రీగా ఒక ఏడాది ఎక్స్ టెండెడ్ వారంటీ కూడా అందిస్తుంది.
వివో X300 అల్ట్రాలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, అడ్రినో 840 జీపీయూతో రన్ అవుతుంది. ఇందులో 16GB వరకు LPDDR5X అల్ట్రా ర్యామ్, 1TB వరకు UFS4.1 స్టోరేజ్ ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. కంపెనీ ఐదేళ్ల OS అప్‌గ్రేడ్‌లు, ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుందని అంచనా. బ్యాటరీ విషయానికొస్తే.. వివో X300 అల్ట్రాలో 6,600mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. :
ఈ ఫోన్ ఫోటోగ్రఫీకి అద్భుతంగా ఉంటుంది. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా (35mm ఫోకల్ లెంగ్త్‌తో), 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. స్క్రీన్ ఫ్లాష్ సపోర్ట్‌తో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ వివో ఫోన్‌తో పాటు టెలిఫోటో యాక్సెసరీలకు కూడా కంపెనీ సపోర్ట్ అందిస్తుంది. బిగ్ గన్ 400 టెలికన్వర్టర్ 400mm ఫోకల్ లెంగ్త్, 17.4x ఆప్టికల్ జూమ్, 200MP అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది.
లిప్‌స్టిక్ 200 టెలికన్వర్టర్ కాంపాక్ట్ డిజైన్‌లో స్టెబిలైజేషన్, మల్టీ షూటింగ్ మోడ్‌లను అందిస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ కనెక్టివిటీ, వై-ఫై, బ్లూటూత్, USB టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. 8.19mm మందంతో, 232 గ్రాముల బరువుతో వస్తుంది.
