వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. అబ్బా ఏముంది భయ్యా.. తక్కువ ధరకే..

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది.

చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివో భారత్‌లో వివో వై19 5జీని భారత్‌లో విడుదల చేసింది. వివో వై18 5జీ గత ఏడాది మేలో విడుదలైన విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది తర్వాత దానికి ఎన్నో అప్‌గ్రేడ్లతో వివో వై19 5జీ లాంచ్‌ అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్, మీడియాటెక్ డైమేసిటీ చిప్‌సెట్, డ్యూయల్ కెమెరా సెన్సార్, భారీ బ్యాటరీతో ఇది వచ్చింది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్స్‌తో దీన్ని విడుదల చేశారు.

Also Read: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ ఫోన్లు కొంటారా?

భారత్‌లో వివో వై19 5జీ.. 4 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధర రూ.10,499గా ఉంది. 4 జీబీ, 128 జీబీ వేరియంట్ల ధర రూ.11,499గా ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంది. పలు బ్యాంక్ కార్డులతో కొంటే రూ .750 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ టైటానియం సిల్వర్. మెజెస్టిక్ గ్రీన్ కలర్లలో వచ్చింది.

ఫీచర్లు
వివో Y19 5G 6.74-అంగుళాల HD+ IPS డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 840 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, తక్కువ బ్లూ లైట్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. 6,300 SOC ద్వారా 6300 SOC ద్వారా 6GB LPDDR4X RAMతో దీన్ని తీసుకొచ్చారు. Android 15- ఆధారిత ఫన్‌టచ్ OS 15లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.