అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ ఫోన్లు కొంటారా?
ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం. శాంసంగ్ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.8-అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
కెమెరాల విషయానికి వస్తే 200MP మెయిన్ సెన్సార్, 50MP 5X టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP 3X ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా అందుబాటులో ఉంది. అమెజాన్‌లో రూ.84,999కే కొనుక్కోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో నడుస్తుంది. 6.9-అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే ఇందులో ఉంది.
ఈ ఫోన్‌లో 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 50 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50 ఎంపీ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే 3x ఆప్టికల్ జూమ్‌తో 10 ఎంపీ టెలిఫోటో షూటర్ ఉంది. 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా అమెజాన్‌లో 1,18,999 రూపాయలకు కొనుక్కోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25
గెలాక్సీ ఎస్ 25.. 6.2-అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేతో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో ఉంటుంది. ఫొటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 3x జూమ్‌తో 10 ఎంపీ టెలిఫోటో లెన్స్, 12 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రూ.67,999కే లభిస్తోంది.