×
Ad

Vivo Y19 5G Price : ఇది కదా డిస్కౌంట్.. వివో Y19 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే?

Vivo Y19 5G Price : వివో Y19 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ కేవలం రూ. 552 ఈఎంఐతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/7
Vivo Y19 5G Price : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. వివో Y19s లాంచ్ తర్వాత వివో Y19 5G ఫోన్ భారీగా తగ్గింది. ప్రస్తుతం జియోమార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.3500 తగ్గింపుతో అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ. 552 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది. వివో Y19 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అన్ని డిస్కౌంట్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
2/7
వివో Y19 5G ఫోన్ అత్యల్ప ధరకే : భారత మార్కెట్లో వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999కి లభ్యమవుతుంది. కానీ, JioUtsav సేల్ సమయంలో జియోమార్ట్ 23శాతం తగ్గింపు తర్వాత మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 11,499కి కొనుగోలు చేసి రూ. 3500 సేవ్ చేసుకోవచ్చు. మీరు పేటీఎం యూపీఐ లేదా యూపీఐ లైట్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీరు రూ. 300 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈఎంఐలో కేవలం రూ. 552తో కొనుగోలు చేయవచ్చు.
3/7
డిస్‌ప్లే, డిజైన్ : వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ స్లిమ్ బాడీ, కాంపోజిట్ ప్లాస్టిక్ బ్యాక్‌తో వస్తుంది. మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. మీరు 1600 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ పొందుతారు. అద్భుతమైన విజువల్స్, స్క్రోలింగ్ కోసం 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌ కూడా కలిగి ఉంటుంది. 700 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కూడా పొందవచ్చు.
4/7
కెమెరా సెటప్ : వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ 13MP మెయిన్ సెన్సార్, 0.08MP డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ పొందవచ్చు. అయితే ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా పొందుతారు. ఈ ఫోన్ నైట్ మోడ్, పోర్ట్రెయిట్, ప్రో మోడ్ వంటి కెమెరా ఫీచర్లను కూడా అందిస్తుంది. సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద 1080p వద్ద వీడియోను రికార్డ్ చేయగలదు.
5/7
బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ : వివో Y19 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌పై రోజంతా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. బాక్సులోనే ఛార్జర్ కూడా వస్తుంది.
6/7
డిస్‌ప్లే : వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రోజువారీ టాస్కులకు గేమింగ్‌కు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీకు ఎలాంటి లాగ్ సమస్య రాదు. వివో ఫోన్ అనేక కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, చివరిది 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది.
7/7
మీరు మైక్రో SD కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. ఫొటోలను ఎడిట్ చేసేందుకు ఏఐ ఎడిటర్, ఇమేజ్ క్వాలిటీని మెరుగుపర్చేందుకు ఏఐ ఫొటో అప్‌గ్రేడ్ వంటి అనేక ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది.