Vivo Y300 5G Launch : వివో Y300 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
Vivo Y300 5G Launch : చైనాలో రాబోయే వివో వై300 ఫుల్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. లీకైన ప్రకారం.. రెండు వెర్షన్లు కూడా విభిన్న ఫీచర్లను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి.

Vivo Y300 5G Key Features Leaked
Vivo Y300 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త వివో వై300 5జీ డిసెంబర్ 16న చైనాలో లాంచ్ అవుతుంది. ఈ బేస్ వివో వై300 చైనీస్ వేరియంట్ భారతీయ వెర్షన్ నుంచి భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. రెండు వేరియంట్‌ల డిజైన్‌లో చాలా తేడా ఉందని టీజర్‌లు వెల్లడించాయి. చైనాలో రాబోయే వివో వై300 ఫుల్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. లీకైన ప్రకారం.. రెండు వెర్షన్లు కూడా విభిన్న ఫీచర్లను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. సెప్టెంబర్‌లో దేశంలో ఆవిష్కరించిన వివో వి300 ప్రోలో స్మార్ట్‌ఫోన్ చేరనుంది.
వివో వై300 5జీ ఫీచర్లు (చైనీస్ వేరియంట్) :
వెయిబో పోస్ట్ ప్రకారం.. వివో వై300 5జీ 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీతో చైనాకు రానుంది. ఈ హ్యాండ్‌సెట్ 4 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని పోస్ట్ పేర్కొంది. 8జీబీ+ 128జీబీ, 8జీబీ + 256జీబీ, 12జీబీ + 256జీబీ, 12జీబీ + 512జీబీ ఉన్నాయి. ఆండ్రాయడ్ 15-ఆధారిత ఆర్జిన్OS 5తో రన్ అవుతుందని భావిస్తున్నారు.
వివో వై300 5జీ చైనీస్ వెర్షన్ 2,392 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 8-బిట్ కలర్ డెప్త్, డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.77-అంగుళాల ఓఎల్ఈడీ ఫ్లాట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని అంచనా. 800నిట్స్ పీక్ మాన్యువల్ బ్రైట్‌నెస్, 1,300నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, 1,800 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా. డెవలపర్ మోడ్‌తో, డిస్‌ప్లే 3,840Hz హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డిఫాల్ట్‌గా 2,160Hz వరకు సపోర్టు ఇస్తుందని తెలిపింది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. చైనాలోని వివో వై300 5జీ 50ఎంపీ 1/2.76-అంగుళాల శాంసంగ్ ఎస్5కెజెఎన్ఎస్ ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు 2ఎంపీ 1/5-అంగుళాల గల్కోర్ జీసీ02ఎమ్1 డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8ఎంపీ, 1/4-అంగుళాల ఓమ్నివిజన్ ఓవీ08D10 సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
వివో వై300 5జీ 6,500mAh బ్యాటరీతో చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ 44డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని టిప్‌స్టర్ సూచిస్తున్నారు. ఈ ఫోన్ 4.5డబ్ల్యూ అవుట్‌పుట్‌తో ఏఏసీ 1326డీ, ఏఏసీ 1116B, గోర్టెక్ 0809తో సహా ట్రిపుల్ స్పీకర్ యూనిట్‌ను ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. 3డీ పనోరమిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ సపోర్టు అందిస్తుంది.
సెక్యూరిటీ విషయానికి వస్తే.. వివో వై300 5జీ చైనీస్ వెర్షన్ ఇన్-డిస్ప్లే షార్ట్-ఫోకస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొంది. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 5, బ్లూటూత్ 5.4 ఉంటాయి. ఈ ఫోన్ ఐపీ64 రేటింగ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
చైనాలో కింగ్ సాంగ్ (Qingsong) వేరియంట్ అధికారికంగా టీజ్ అయింది. 7.79ఎమ్ఎమ్ సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు ఆప్షన్లు 7.85ఎమ్ఎమ్ మందం, 199.9 గ్రాముల బరువు ఉంటుందని భావిస్తున్నారు.
Read Also : Vivo X200 Series Launch : వివో కొత్త X200 సిరీస్ చూశారా? ఒకటి కాదు.. రెండు ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?