×
Ad

Vivo Y400 5G Discount : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన వివో Y400 5G ఫోన్.. ఇలాంటి డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Vivo Y400 5G Discount : వివో కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ కలిగిన వివో Y400 5G ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.

Vivo Y400 5G Discount

Vivo Y400 5G Discount : వివో కొత్త ఫోన్ కొంటున్నారా? మీకో అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ సేల్‌లో వివో Y400 5G ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 4వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 50MP సోనీ ప్రైమరీ సెన్సార్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

ఇలాంటి అద్భుతమైన డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ (Vivo Y400 5G Discount) కూడా పొందవచ్చు. వివో Y400 5జీ ఫోన్ రూ. 4వేలు తగ్గింపుతో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో ఫోన్‌పై రూ.4వేల తగ్గింపు :

భారత మార్కెట్లో వివో Y400 5G (8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్) ఆప్షన్ ఫోన్ రూ. 25,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు 15శాతం తగ్గింపుతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 21,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు యాక్సస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా, మీరు వివో Y400 ఫోన్‌ కొనుగోలుపై మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 21,140 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్ :
వివో వై400 5జీ ఫోన్ 6.67-అంగుళాల FHD+ స్క్రీన్‌తో వస్తుంది. స్క్రోలింగ్, స్ట్రీమింగ్ కోసం ఫ్లూయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. నేరుగా సూర్యకాంతిలో కూడా స్ర్కీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 1,800 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. మీరు ఈ ఫోన్‌ను తడి చేతులతో కూడా టచ్ ఆపరేట్ చేయొచ్చు.

Read Also : Top 4K Smart TVs : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌.. టాప్ 3 4K స్మార్ట్‌టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన టీవీ ఇంటికి తెచ్చుకోండి!

డిస్‌ప్లే :
వివో Y400 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8జీబీ ఫిజికల్ ర్యామ్, మల్టీ టాస్కింగ్ కోసం అదనంగా 8GB ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా లేటెస్ట్ ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఏఐ నోట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ వంటి అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ IMX852 మెయిన్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ వివో ఫోన్ కెమెరా అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, ఏఐ ఎరేస్ 2.0, ఏఐ ఫొటో ఎన్‌హాన్సర్ వంటి మోడ్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 2 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ను 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో క్విక్ ఛార్జ్ చేయొచ్చు. దాదాపు 20 నిమిషాల్లో 0 నుంచి 50శాతం వరకు ఛార్జ్ అవుతుంది.