Vivo Y400 5G (Image Credit To Original Source)
Vivo Y400 5G : వివో ఫోన్‌పై కిర్రాక్ ఆఫర్.. అమెజాన్‌లో వివో 5జీ ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. 32MP సెల్ఫీ కెమెరాతో వివో Y400 5జీ సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఫోన్ రూ.1500 తగ్గింపుతో కొనేసుకోవచ్చు. అలాగే, ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ.20వేల నుంచి రూ. 22వేల రేంజ్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే వివో Y400 5జీ అద్భుతమైన ఆప్షన్.
అంతేకాదు.. ఈ వివో ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్లతో పాటు రివార్డులను కూడా అందిస్తోంది. ఇందులో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 22,999కు లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే ఉంటుది. అప్పటిలోగా రూ.1500 వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
Vivo Y400 5G (Image Credit To Original Source)
ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు :
ఈ వివో ఫోన్ రూ. 1149 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఇంకా చౌకైన ధరకే కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, క్వాలిటీ, అలాగే కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
వివో Y400 5జీ స్పెషిఫికేషన్లు :
కంపెనీ ప్రకారం.. ఈ వివో ఫోన్ 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ మానిటర్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 1800 నిట్స్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం, 8GB ర్యామ్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ అందిస్తుంది.
ఈ వివో ఫోన్ 2MP డెప్త్ సెన్సార్, ఫొటోగ్రఫీకి 50MP ప్రైమరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం కంపెనీ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ 6000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. IP68 + IP69 డస్ట్, వాటర్ రెసెస్టింట్ గ్రేడ్‌తో వస్తుంది.
ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15తో ఫన్‌టచ్ OS15 పవర్ అందిస్తుంది. బయోమెట్రిక్ సేఫ్టీ కోసం స్టార్టప్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఈ వివో ఫోన్‌లో అనేక ఏఐ ఫంక్షన్లు అత్యంత ఆకర్షణగా చెప్పవచ్చు.