Republic Day Sale 2026 : ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఈ రిపబ్లిక్ డే సేల్‌లో ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?
Republic Day Sale : వారెవ్వా.. ఐఫోన్లు భలే ఉన్నాయిగా.. అమెజన్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ మొదలు కానుంది. ఆపిల్ ఐఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
Republic Day Sale (Image Credit To Original Source)
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ 2026 ఆఫర్లు
- ఆపిల్ ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు, మరెన్నో బ్యాంకు ఆఫర్లు
- ఐఫోన్ 15, ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లపై భారీ తగ్గింపు
Republic Day Sale 2026 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి, రిపబ్లిక్ డే సేల్ 2026 అద్భుతమైన అవకాశం. ఖరీదైన ఫోన్లను తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆపిల్ ఐఫోన్ మోడల్ ఎంచుకోవచ్చు. అలాగే, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో ఐఫోన్ కొనుగోలుపై వేలాది రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
2026 ఏడాది ప్రారంభంలో ఆపిల్ ఐఫోన్లు మరింత సరసమైన ధరకే లభిస్తున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే రిటైలర్లు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్లు ఇష్టపడే వారికి ఈ సేల్ అద్భుతంగా ఉంటుంది. రిపబ్లిక్ డేకి ముందే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అనేక ఐఫోన్ మోడళ్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తున్నాయి.
ఐఫోన్ 17 :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ (256GB) వేరియంట్ ధర దాదాపు రూ. 82,900కి లభిస్తోంది. కానీ, రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అసలు ధర దాదాపు రూ. 74,వేలకు తగ్గుతుంది. లేటెస్ట్ ఐఫోన్ కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్.
ఐఫోన్ 17 ప్రో :
ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 1,34,900గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,25,400కే అందుబాటులో ఉంది. ఇతర డీల్స్ లేకున్నా ఈ ఐఫోన్ నేరుగా ధర తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లతో ఈ ఐఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

Republic Day Sale (Image Credit To Original Source)
ఐఫోన్ 17 ప్రో మాక్స్ :
అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ. 1,40,400 తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ. 1,49,900 ఉండగా ఇప్పుడు చౌకైన ధరకే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. హై-ఎండ్ కెమెరా, భారీ డిస్‌ప్లే, అత్యున్నత పర్ఫార్మెన్స్ కోరుకునే ఎవరికైనా అద్భుతమైన అవకాశం.
ఐఫోన్ ఎయిర్ :
ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 1,19,900 ఉండగా ఇప్పుడు అమెజాన్‌లో రూ. 91,249 మాత్రమే అందుబాటులో ఉంది. క్వాలిటీ లుక్, సన్నని డిజైన్ ఇష్టపడే కస్టమర్లకు రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లలో బెస్ట్ ఆప్షన్.
ఐఫోన్ 16 :
సాధారణంగా ఐఫోన్ 16 ధర రూ. 64,900 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 56,999కి అందుబాటులో ఉంది. పాత ఐఫోన్ మోడల్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్. సరసమైన ధరలో కొనేందకు ఇదే బెస్ట్ ఆప్షన్.
ఐఫోన్ 15 :
అమెజాన్‌లో ఐఫోన్ 15 కేవలం రూ. 50,249కి అందుబాటులో ఉంది. రూ.79,900 లాంచ్ ధర కన్నా దాదాపు రూ. 29వేలు తగ్గింపుతో లభిస్తోంది. సరసమైన ధరలో మీకు నచ్చిన ఐఫోన్ కొనేసుకోవచ్చు.
